రాజస్థాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆజ్మీర్ జిల్లాలో ఓ భవన నిర్మాణంపై ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ భవన నిర్మాణ విషయంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకోవడంతో పాటు కాల్పులు జరుపుకున్నారు. దీంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హింసకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.