కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. కొండన్న పల్లి స్టేజి వద్ద కారును వెనక నుంచి బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు వెనుక భాగం ధ్వంసం కాగా, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.