VZM: మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిలో బొబ్బిలికి చెందిన కె.సౌమ్య ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.