VZM: కొత్తవలస మండలం కాంటకాపల్లి వద్ద శారదమెటల్స్ పరిశ్రమయార్డ్ లోని బొగ్గులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.ఒడిశాలోని లారీలో దిగుమతి చేసుకున్న స్టీమ్డ్ కోల్ బొగ్గుయార్డ్ ఆన్లోడ్ చేశాక మృతదేహం గుర్తించినట్లు కంపెనీ హెచ్.అర్.హెచ్.సన్యాసిరావు పోలీసులకుసమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు సీఐ షణ్ముఖరావు యార్డ్‌ను పరిశీలించారు. మృతుడు 35-40 మధ్య వయస్సు ఉంటుందని పేర్కొన్నారు.