ATP: అనంతపురంలోని నేషనల్ పార్క్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా లోడు లారీ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.