NLR: కావలి మండలం పెద్దవరం- ఆర్ సి పాలెం మార్గంలోని అడవిలో కోడిపందెం స్థావరంపై ఆదివారం రూరల్ సీఐ జి. రాజేశ్వరరావు, ఎస్సై బాజీ బాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. నిందితుల నుంచి రూ. 15, 400 నగదు, నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.