AP: అల్లూరి జిల్లాలో జలపాతంలో గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని అమృత, సౌమ్యలుగా గుర్తించారు. గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నిన్న ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహించి ఐదుగురు కొట్టుకుపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా.. మిగిలిన ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే.