WG: నరసాపురంలో గంజాయి రవాణా చేస్తూ ముగ్గురు దొరికారు. అరుంధతీపేటకు చెందిన సిర్రా పెద్దిక్, కప్పల సందీప్, బొల్లం మణిచంద్రమౌళిల గంజాయి తీసుకు వస్తూ పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని సీఐ యాదగిరి కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. 1.930 కిలోల గంజాయి పట్టుబడగా.. దీని విలువ రూ.39 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.