ELR: పెదపాడు మండలానికి చెందిన భార్యాభర్తలకు సోమవారం జీవిత ఖైదు శిక్ష పడిందని ఏలూరు పోక్సో కోర్టు ఇంఛార్జ్ పీపీ రామాంజనేయులు తెలిపారు. విజయలక్ష్మికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. భర్త మృతితో మేనమామ సతీశ్‌ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఆ ఇద్దరిపై సతీశ్ అత్యాచారం చేయగా 2023లో కేసు నమోదయిందన్నారు. నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.