NLR: జిల్లా వింజమూరు మండలంలో మోటర్ తీగలు చోరీ చేయడం సంచలనంగా మారింది. వింజమూరు మండలం తక్కెళ్ళపాడులో పొలంలో ఉన్న ఓ మోటార్ తీగలు, పలు సామగ్రిని దొంగిలించారు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.