NZB: బోధన్ సాలుర మండల హన్సా గ్రామానికి చెందిన సంజు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై బోధన్ వెళుతుండగా సోమవారం ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి NH 63కి అనుసంధాన అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారిలో సాలూర వద్ద మహారాష్ట్ర నుంచి బోధన్ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొనడంతో సంజూ అక్కడికక్కడే మృతి చెందారు.