ATP: అనంతపురం నగరం నేషనల్ పార్కు సమీపంలో సోమవారం టమాటా లోడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామానికి చెందిన దంపతులు హనుమంత రెడ్డి, రంగమ్మగా పోలీసులు గుర్తించారు. వారు అనంతపురంలో ఉంటున్న తమ కుమార్తెలను చూసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.