ఇరాన్ తబాస్లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ఇందులో ఇప్పటి వరకు 38 మంది మరణించగా.. 14 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మీథేన్ వాయువు అకస్మాత్తుగా లీక్ కావడం వల్ల పేలుడు జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, మృతదేహాలపై ఎలాంటి బ్లాస్ట్ గాయాలు లేవని, వాళ్లు పేలుడుకు ముందే వాయువు వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.