AP: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 10 మంది వద్ద దాదాపు రూ.కోటి వసూలు చేసిన మోసానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపి, దొంగ అధికారులతో విచారణ పేరుతో మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.