తూ.గో: తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడింది. కాగా ఆ మహిళ భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తుని రూరల్ పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.