»Karnisena Brutal Murder In Rajasthan In Broad Daylight
Karnisena: పట్టపగలే రాజస్థాన్‌లో దారుణ హత్య
గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ మరణించారు. జైపూర్‌లో గల అతని నివాసంలో హత్య చేశారు.
Karnisena: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ రాజస్థాన్‌లో పట్టపగలే దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. జైపూర్‌లో గల శ్యామ్నగర్లో ఉన్న నివాసంలో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. గోగామేడీతో మాట్లాడాలని భద్రతా సిబ్బందికి చెప్పి ఇంటి లోపలికి వెళ్లారు. కొంత సమయం మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా కాల్చి చంపారు. ముగ్గురు వ్యక్తులు ఆయనను కాల్చి చంపగా.. అందులో ఒకడైన నవీన్ షెకావత్‌ను సుఖ్‌దేవ్ సింగ్ సహచరులు కాల్చి చంపారు. ఈ ఘటనలో గోగామేడీ అనుచరుడు ఒకరు చనిపోగా.. ఇద్దరికీ గాయాలు అయ్యాయి.
Rajasthan | Members of the Rajput community sit in protest against the murder of Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena, in Jaipur
The Rajput community outfits supporting Sukhdev Singh Gogamedi have called for a state-wide bandh today pic.twitter.com/T0FTFVJMSm
ఎన్నికల ఫలితాల తర్వాత రాజస్థాన్‌లో ఈ హత్య జరగడం కలకలం రేపుతోంది.హత్యకు నిరసనగా రాజస్థాన్‌లో రాజ్‌పుత్ సామాజిక వర్గం రోడ్డపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈరోజు అక్కడ బంద్ ప్రకటించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని రాజ్‌పుత్ సామాజిక వర్గం డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని చురు, ఉదయ్‌పూర్, అల్వార్, జోధ్‌పూర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ప్రజలు నిరసనలకు దిగడం వల్ల సమస్య తీవ్రంగా పెరిగింది.