సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి హస్తినలో బిజీగా ఉన్నారు. వరసగా అగ్రనేతలను కలుస్తూ వస్తున్నారు. కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని మరి మరి కోరారు.
Revanth Reddy: తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో బిజీగా ఉన్నారు. హైకమాండ్ పిలుపుతో నిన్న రాత్రే ఢిల్లీ చేరుకోగా.. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్ పేరును నిన్న కేసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా ఒక్కొక్కరిని కలుస్తూ.. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని రేవంత్ ఇన్వైట్ చేస్తున్నారు.
కేసీ వేణుగోపాల్‌తో భేటీ తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అక్కడినుంచి నేరుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (sonia gandhi) ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమెను కలిసి.. పార్టీ విజయం గురించి మాట్లాడారు. రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. అనారోగ్యం వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా పాల్గొనని సంగతి తెలిసిందే. చివరి రోజు వీడియో సందేశం మాత్రం ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రేవంత్ కలిశారు. సీఎల్పీ నేతగా రేవంత్ పేరును రాహుల్ గాంధీ (Rahul gandhi) ప్రతిపాదించారు. అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ (Revanth) అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
New Telangana Chief Minister Revanth Reddy is here in Delhi to meet Sonia Gandhi. pic.twitter.com/5X1Fm8H859
ప్రమాణ స్వీకారానికి రావాలని రాహుల్‌ను రేవంత్ ప్రత్యేకంగా కోరారు. తర్వాత స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీని కూడా రేవంత్ మీట్ అయ్యారు. మీ ప్రచారం వల్ల పార్టీకి మరింత బూస్ట్ వచ్చిందని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు.
ఇటు హైదరాబాద్‌లో గల రేవంత్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో రేవంత్ ఉంటున్నారు. ఇక్కడే ఉండాలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. సమీపంలో 44ఏ రోడ్డులో రేవంత్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయం ఉంది. ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సమాచారం అందింది. మరోవైపు రేపు రేవంత్ ప్రమాణ స్వీకారం చేసే ఎల్బీ స్టేడియాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించారు.