»Israel Hamas War Muslim Children Killed In Usa Hamas Attack Jews Muslim Hate Crime
Israel Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో 6ఏళ్ల ముస్లిం చిన్నారి దారుణ హత్య
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో 71 ఏళ్ల వృద్ధుడు ఈ షాకింగ్ ఘటనకు పాల్పడ్డాడు. 32 ఏళ్ల చిన్నారి తల్లిని కూడా కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.
Israel Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో 71 ఏళ్ల వృద్ధుడు ఈ షాకింగ్ ఘటనకు పాల్పడ్డాడు. 32 ఏళ్ల చిన్నారి తల్లిని కూడా కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడు జోసెఫ్ ఎం కజుబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముస్లిం వ్యతిరేక మనస్తత్వం కారణంగానే ఆ వ్యక్తి చిన్నారిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.
యుఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్లెయిన్‌ఫీల్డ్ టౌన్షిప్లో పాలస్తీనా-అమెరికన్ బిడ్డ అయిన వాడియా అల్-ఫయూమ్, అతని తల్లిపై కత్తులతో దాడి చేశారు. బాలుడు 26 సార్లు కత్తిపోట్లకు గురయ్యాడు వెంటనే అతను మరణించాడు. ఆ వృద్ధుడు తన తల్లిపై కూడా పలుమార్లు కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ముస్లిం గుర్తింపు, ప్రతిస్పందన కారణంగా నిందితుడు బాధితులను లక్ష్యంగా చేసుకున్నట్లు సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో యూదు, ముస్లిం వర్గాలు పరస్పరం వ్యతిరేకంగా ప్రకటనలు చేసుకుంటున్నారు. బెదిరింపు ప్రకటనలు సర్వసాధారణమైపోయాయి. కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR), ముస్లిం పౌర హక్కుల సంస్థ, ఈ సంఘటనను పీడకలగా అభివర్ణించింది. అమెరికాలోని ముస్లింల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. బాలుడి మేనమామ యూసఫ్ హనాన్ చిన్నారి హత్యపై విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి హింసను ఎదుర్కొంటూ మానవత్వం చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు.