Hyderabad: హైదరాబాద్ ఉగ్రవాదులకు ఐదేళ్ల జైలు శిక్ష
హైదరాబాదీ ఉగ్రవాదులకు ఐదేళ్ల జైలు శిక్షను విధించినట్లు ఎన్ఐఏ కోర్టు వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరిని 2019లో అరెస్ట్ చేయగా ఇప్పటికీ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఉద్రవాదులకు ఎన్ఐఏ కోర్టు (NIA Court) ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. భాగ్యనగరానికి చెందిన అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ లను ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసినట్లు ప్రకటించింది. గతంలో అబుదాభి మాడ్యూల్ ద్వారా వీరిద్దరూ పేలుళ్లకు కుట్ర చేసిన సంగతి తెలిసిందే. యువతను మభ్యపెట్టి వారిని ఐసిస్ వైపు మొగ్గుచూపేలా బాసిత్ ప్రయత్నాలు చేశాడు. ఎక్కువ మంది అబ్బాయిలను తన మాటలతో ఆకర్షించారు.
బాసిత్ కు మరో ఉగ్రవాది అయిన అద్నాన్ హుస్సేస్ నిధులు సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. డబ్బుతో యువకులను ఆకర్షించి వారిని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దారు. ఈ ప్రయత్నంలో బాసిత్ తన సహచర ఉగ్రవాదులకు వీసా, పాస్ పోర్టులను ఏర్పాటు చేశాడు. 2017లో అబ్దుల్ బాసిత్ ఇంటర్వ్యూల ద్వారా చాలా మంది యువకులను ఆకర్షించేవాడు.
ఆ సమయంలోనే అబ్దుల్ బాసిత్ ఇంటర్వ్యూ చూసి అబ్దుల్ ఖాదిర్ ఆకర్షితుడయ్యాడు. బాసిత్ నిర్వహించే ఐసిస్ కార్యక్రమాలకు ఖాదిర్ హాజరయ్యేవాడు. 2018లో ఎన్ఐఏ వారిద్దరినీ అరెస్ట్ చేయగా 2019లో ఇద్దరిపై సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ వేసింది. తాజాగా వారిద్దరికీ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు శిక్షను ఖరారు చేసినట్లు తీర్పునిచ్చింది.