»Rajamouli Planning With Hollywood Actors In Mahesh Babu Movie
Mahesh babu: హాలీవుడ్ యాక్టర్స్‌తో భారీగా ప్లాన్ చేస్తున్న రాజమౌళి!
ప్రజెంట్ యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అతిపెద్ద అనౌన్స్మెంట్ రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ మాత్రమేనని చెప్పొచ్చు. ఈ క్రేజీ కాంబో కన్ఫామ్ అయిపోయింది. కానీ.. అధికారిక ప్రకటన మాత్రం బయటికి రాలేదు. కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాత్రం సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. అదెంటో చుద్దాం.
rajamouli planning with hollywood actors in mahesh babu movie
ఈ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు బయటికొస్తుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్. చాలా రోజులగా మహేష్ బాబు(mahesh babu) బర్త్ డే గిఫ్ట్‌గా ఆగష్టు 9న ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్ ఉంటుందని వినిపించింది. కానీ రాజమౌళి నుంచి కనీసం లీకులు కూడా బయటికి రాలేదు. ప్రస్తుతం రాజమౌళి తండ్ర విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు వర్క్‌తో బిజీగా ఉన్నారు. అయితే అప్పుడప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాకు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చే ఇంటర్య్వూల్లో అదిరిపోయే అప్డేట్స్ మాత్రం ఇస్తునే ఉన్నాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో.. ఆఫ్రికా నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతోందని.. మరోసారి క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ నటులు కూడా భాగం కాబోతున్నారని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
వాస్తవానికి ముందు నుంచి ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ యాక్టర్స్(hollywood actors) ఇన్వాల్వ్ కాబోతున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే జక్కన్న హాలీవుడ్ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ఇక ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో.. ఎస్ఎస్ఎంబీ 29(SSMB 29)లో ఉండే హాలీవుడ్ యాక్టర్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఈ సినిమాను జక్కన్న ఊహకందని విధంగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ రూ.800 నుంచి వెయ్యి కోట్లనే టాక్ నడుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించాలంటే ఆ మాత్రం బడ్జెట్ పెట్టాల్సిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా అయిపోగానే రాజమౌళితో చేతులు కలపనున్నాడు.