యంగ్ హీరో శర్వానంద్(sharwanand)కు అసలు ఏమైంది? అని ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ కూడా కాస్త ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో సర్జరీ అంటూ.. ఏదేదో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అమెరికాకు కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఇటీవలె రక్షితారెడ్డిని పెళ్లి చేసుకకొని ఒక ఇంటివాడు అయ్యాడు యంగ్ హీరో శర్వానంద్(sharwanand). ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఒక ఇంట్రెస్టింగ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘బేబీ ఆన్ బోర్డ్’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా శర్వానంద్ తనభార్యతో కలిసి అమెరికా(america) వెళ్లాడనే న్యూస్ వైరల్‌గా మారింది. అమెరికాకు వెళ్తే వైరల్ ఏంటి అనుకునేరు. కానీ శర్వానంద్ వెళ్లింది సర్జరీ కోసమట. అయితే అది నార్మల్ సర్జరీనే అని తెలుస్తోంది. గతంలో జాను సినిమా సమయంలో ఎత్తైన ప్రదేశం నుంచి కిందపడిపోవడంతో.. శర్వానంద్ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆ గాయం తగ్గినప్పటికీ.. ఇప్పటికీ నొప్పి మాత్రం పోవడం లేదట. అందుకే.. ఈ ఆపరేషన్ అని అంటున్నారు.
అక్కడ సర్జరీ చేయించుకుని కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి ఇండియా(india)కు రానున్నాడట. ఆ తర్వాత బేబీ ఆన్ బోర్డు సెట్స్‌లో జాయిన్ అవనున్నాడని సమాచారం. అన్నట్టు.. ఈ మధ్య హీరోలకు సర్జరీలు(surgery)కామన్ అయిపోయాయి. ప్రభాస్, చిరంజీవి సైతం మోకాలి సర్జరీలు చేయించుకున్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి. అయినా హీరోలకు షూటింగ్లలో జరిగే గాయాలకు ఇలాంటి తప్పవు. ఇకపోతే.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోయే హీరోలలో శర్వానంద్ ముందు వరుసలో ఉంటాడు. కానీ గత కొంత కాలంగా సరైన హిట్ అందుకోవడం లేదు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పైగా పెళ్లి తర్వాత వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి.. బేబీ ఆన్ బోర్డ్ హిట్ అనే నమ్మకంతో ఉన్నాడు.