»Delhi Guwahati Train Derailed Four Dead 50 Injured Bihar Raghunathpur Railway Station
Train derailed: పట్టాలు తప్పిన ట్రైన్..నలుగురు మృతి, 50 మందికి గాయాలు
బీహార్‌లోని బక్సర్‌లోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా..మరో 50 మంది గాయపడ్డారు.
Road accident in Chittoor district Three women died
బీహార్(bihar)లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్(Raghunathpur) రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా..మరో 50 మందికి పైగా గాయపడ్డారు. రైలు నంబర్ 12506 నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అస్సాంలోని గౌహతి కామాఖ్య జంక్షన్‌కు(Delhi Guwahati Train)వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి 21:35 గంటల ప్రాంతంలో పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో మిగతా కోచ్‌లు కూడా పట్టాలు తప్పి ప్రమాదం చోటుచేసుకుంది.
#WATCH | Bihar: Visuals from Raghunathpur in Buxar where 6 coaches of North East Express train derailed; Railway and police officials are present on the spot. pic.twitter.com/l87QzriNgX
దాదాపు 50 మంది గాయపడినట్లు స్థానిక జిల్లా యంత్రాంగం నుంచి సమాచారం అందిందని తూర్పు మధ్య రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) బీరేంద్ర కుమార్ తెలిపారు. అంతేకాదు ఈ ఘటనలో మొత్తం 21 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, స్థానికులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలను తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని AIIMS పాట్నాకు తీసుకెళ్లారు. మరికొంత మంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన కారణాలపై విచారణ జరుపుతామని అధికారులు(officers) తెలిపారు.
ఈ ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. తరలింపు, రెస్క్యూ పూర్తయిందని పేర్కొన్నారు. అన్ని కోచ్‌లు తనిఖీ చేయబడ్డాయని, ప్రయాణీకులు వారి తదుపరి ప్రయాణం కోసం ప్రత్యేక రైలుకు మార్చబడతారని వైష్ణవ్ పోస్ట్ చేశారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై అసోం ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. బక్సర్, ఇతర ఏజెన్సీలలోని జిల్లా అధికారులతో ఈ ప్రమాదం గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.