టాలీవుడ్ చిత్రసీమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఆ మధ్య టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ , నటి నటులు , టెక్నీషన్ల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో వినిపించడం..ఆ తర్వాత వారికీ క్లిన్ చిట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో అషు రెడ్డి(Ashu reddy) పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది.
అషు రెడ్డి(Ashu reddy) ఈ పేరు తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిగ్ బాస్ షో ద్వారా బాగానే పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఆ షో తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌లు, వీడియో సాంగ్స్‌లో కనిపించిన అషు రెడ్డి ఓ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. తాజాగా కబాలి చిత్రం నిర్మాత కెేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టు పడడంతో అతని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు, నటి అషు రెడ్డితో వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు.
అయితే ఈ డ్రగ్స్(drugs case) వ్యవహారం తో తనకు ఏ సంబంధం లేదని అషు రెడ్డి చెప్పుకొచ్చింది. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. మీడియాలో పేర్కొన్నట్లు తనకు ఎవరితోనూ డ్రగ్స్ సంబంధాలు లేవని చెప్పింది. అవన్నీ తప్పుడు వార్తలని ఆమె కొట్టిపారేసింది. అవసరమైతే విచారణ ఎదుర్కొంటానని సంబంధిత అధికారులకు వాస్తవం ఏమిటో తెలియజేస్తానని తెలిపింది. కానీ తన ఫోన్ నంబర్ ను అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరికలు చేసింది.