Bihar: బీహార్లో ఓ మైనర్ యువతి దాదాపు 300అడుగుల ఎత్తులో ఉండే హిరణ్య పర్వతం నుంచి దూకింది. నలంద జిల్లాలో నివసించే ఆ యువతి తన ప్రియుడితో కలిసి ఆ హిరణ్య పర్వతానికి వెళ్లింది. ఇద్దరూ ఆ పర్వతం మీద ఉండే గుడి దగ్గర కూర్చొని కొంత సమయం మాట్లాడుకున్నారు. తర్వాత వీరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు. కానీ గొడవ అయిన వెంటనే ఆ యువతి హిరణ్య పర్వతం నుంచి దూకేసింది. వెంటనే ప్రేమికుడు భయంతో అక్కడ నుంచి పారిపోయాడు.
ఆ పర్వతం మీద నుంచి దూకేసిన యువతి పొదల మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ యువతి కేకలు విన్న చుట్టుపక్క వాళ్లంతా అక్కడికి వచ్చారు. వెంటనే 112కి కాల్ చేశారు. కానీ వాళ్లు రాకముందే దాదాపు 45 నిమిషాలు శ్రమించి ఆ యువతిని పొదల్లో నుంచి బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే బీహార్ ఆసుపత్రికి పంపించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను పావాపురి ఆసుపతికి తరలించారు.