• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎన్నికల్లో INTUC గెలుపు

SRD: చరిత్ర కలిగిన పటాన్చెరులోని ఓ ప్రముఖ పెయింట్స్ పరిశ్రమ కార్మిక సంఘ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. ఇప్పటివరకు ఆధిపత్యం చూపిన CITUపై INTUC కార్మిక సంఘం విజయం సాధించింది. మొత్తం 278 ఓట్లు పోలవగా, INTUC తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన జి. సంజీవరెడ్డికి 142 ఓట్లు లభించాయి. CITU తరఫున పోటీ చేసిన చుక్క రాములు 134 ఓట్లు సాధించారు. దీంతో INTUC గెలుపు ఖాయమైంది.

March 14, 2026 / 06:35 PM IST

‘బడ్జెట్​లో రూ.15వేల కోట్లు కేటాయించాలి’

KMR: వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఫీజు బకాయిల కోసం రూ.15వేలు కోట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండేళ్ల ప్రభుత్వ నిధుల విడుదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ పథకాన్ని నీరుగారిస్తే ప్రభుత్వ పీఠం కదిలిస్తామని హెచ్చరించారు.

March 14, 2026 / 06:33 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన వార్డు సభ్యులు

MDK: చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

March 14, 2026 / 06:32 PM IST

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నదానం

WGL: ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. నగరంలోని భద్రకాళి ఆలయం ఆర్చి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజేంద్రప్రసాద్, గడ్డం రాకేష్, అభిలాష్, అనుదీప్ తదితరులున్నారు.

March 14, 2026 / 06:30 PM IST

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

SRPT: జిల్లా కేంద్రంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల కేంద్రాలను శనివారం ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు పరీక్ష సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సలహాలు సూచన అందించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు.

March 14, 2026 / 06:22 PM IST

ఈనెల 16 నుంచి టోల్ చార్జీలు పెంపు

NLG: మాడుగులపల్లి మండల కేంద్రంలో గల టోల్ ప్లాజా నందు ఈనెల 16 నుంచి వాహనాలకు టోల్ చార్జీలు పెరుగుతున్నట్లు టోల్ ప్లాజా యజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై ఉన్న ఈ టోల్ ప్లాజాను ఈ నెల 16 నుంచి రేట్ల పెరుగుదలపై పత్రాలు విడుదల చేశారు. టోల్ చార్జెస్ పెరుగుతున్నందువలన అటు వెళ్లే వాహనదారులు గమనించాలని కోరారు.

March 14, 2026 / 06:20 PM IST

ప్రతి ఒకరు బాధ్యతతో మొక్కలు నాటాలి: సర్పంచ్

HNK: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలోని నర్సరీ పనులను సర్పంచ్ రమా-రఘోత్తం రెడ్డి, ఉపసర్పంచ్ రవివర్మ, GP కార్యదర్శి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని కాపాడాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

March 14, 2026 / 06:11 PM IST

డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం

WGL: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వరంగల్ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని SI రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రేటర్ WGL వర్కింగ్ ప్రెసిడెంట్ R శ్రీహరి పాల్గొన్నారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం యువత ముందుకు రావాలన్నారు.

March 14, 2026 / 06:10 PM IST

‘ధర్మారంలో టెన్త్ పరీక్షకు 100% హాజరు నమోదు’

PDPL: ధర్మారం మండలంలో ఇవాళ జరిగిన టెన్త్ క్లాస్ తెలుగు పరీక్షకు 100% విద్యార్థులు హాజరయ్యారని ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. మొత్తం 5 కేంద్రాలలో 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 710 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. మొదటి రోజు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.

March 14, 2026 / 06:07 PM IST

బోథ్ గ్రామ పంచాయతీని సందర్శించిన DLPO

ADB: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బోథ్ గ్రామ పంచాయతీని DLPO ఫణీందర్ రావు శనివారం సందర్శించారు. స్థానిక గ్రామ పంచాయతీ నర్సరీ పనులను పరిశీలించారు. అదేవిధంగా వీధి కుక్కల సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. DLPOతో MPDO రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

March 14, 2026 / 06:07 PM IST

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతలేదు : కలెక్టర్

MBNR: జిల్లా వ్యాప్తంగా ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ ఇశాళ ఒక ప్రకటన విడుదల చేశారు. గృహ అవసర గ్యాస్ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకూడదన్నారు. అలాగే సంక్షేమ హాస్టల్స్, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు.

March 14, 2026 / 06:07 PM IST

‘గృహంలో ఉపయోగించే మొక్కలను నర్సరీలో పెంచాలి’

SRCL: గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్‌లో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారో అడిగి తెలుసుకున్నారు.

March 14, 2026 / 06:07 PM IST

హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ప్రవేశాలకు కలెక్టర్ పిలుపు

SRPT: హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రవేశాలు ప్రారంభమైనట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా 60 సీట్లు భర్తీ చేస్తారని, ఎంపికైన వారికి నెలకు రూ. 2,500 స్టైపెండ్ అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 040-29367009 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

March 14, 2026 / 06:07 PM IST

తాగునీటి బోరును ప్రారంభించిన డిప్యూటీ మేయర్

MBNR: మహబూబ్ నగర్‌లోని 11వ డివిజన్‌లో నూతన తాగునీటి బోరును డిప్యూటీమేయర్ సురేందర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల ఏరియా, గొల్లబండ తండా ప్రాంతాలలో ఆయన పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలను గుర్తించారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యలన్నీ పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

March 14, 2026 / 06:05 PM IST

‘పదో తరగతి పరీక్షలకు 99.91% హాజరు’

MHBD: జిల్లాలో ఇవాళ జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష(ఫస్ట్ లాంగ్వేజ్) ప్రశాంతంగా జరిగింది. మొత్తం 8,151 మంది విద్యార్థులకు 8,144 మంది హాజరు కాగా,7 మంది గైర్హాజరైనట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. దీంతో 99.91 శాతం హాజరు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.

March 14, 2026 / 06:05 PM IST