HNK: వీల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు భవనానికి విద్యుత్ శాఖ అధికారులు అకారణంగా విధించిన అపరాధ రుసుమును రద్దు చేయాలని ఇవాళ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. విధించిన జరిమానాను తక్షణమే రద్దు చేయడంతో పాటు భవనానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
GDWL: గద్వాలలోని గ్యాస్ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రెండు బుకింగ్‌ల మధ్య 45 రోజుల గడువు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల గడువు తప్పనిసరి అని తెలిపారు.
SDPT: ముదిరాజుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఇచ్చిన హామీ బీసీ డిక్లరేషన్ చేయకుండా ముదిరాజులను బీసీ ఏలో చేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
SRD: 2025 26 సంవత్సరానికి షెడ్యూల్ కులాలకు 409 యూనిట్లు మంజూరైనట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని చెప్పారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
MBNR: స్నేహపూర్వక వాతావరణంలో మైనార్టీలు రంజాన్ పండుగను జరుపుకోవాలని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 37వ వార్డులో మైనార్టీలకు రంజాన్ సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తుంది అన్నారు.
MBNR: స్నేహపూర్వక వాతావరణంలో మైనార్టీలు రంజాన్ పండుగను జరుపుకోవాలని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 37వ వార్డులో మైనార్టీలకు రంజాన్ సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తుంది అన్నారు.
MNCL: చిన్నారుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. బుధవారం ఆ పాఠశాల ఆవరణలో ‘అమ్మానాన్న ఆశీర్వాదం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
NZB: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 23న జరిగే ‘చలో సెంట్రల్ లేబర్ కమిషనరేట్’ ధర్నాను జయప్రదం చేయాలని ఐఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దాసు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
BHNG: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో ప్రసంగించి ఖండించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలని కేటాయించిది. పేదల ఇళ్ల స్థలాల్లో నిషేదిత జాబితా గురించి పేదలకు అన్యాయం చేయొద్దని ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రస్తావించారు.
MDK: జిల్లాలో గృహ వినియోగానికి సంబంధించిన LPG సిలిండర్ల దుర్వినియోగం, మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్‌కు అధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇవాళ మెదక్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు. హోటల్స్, టీ పాయింట్లలో వాణిజ్య వినియోగం కోసం అక్రమంగా ఉపయోగిస్తున్న 52 సిలిండర్లను పట్టుకున్నారు.
WNP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ జడ్జి రజిని ఆదేశాల మేరకు జిల్లాలోని భవిత సెంటర్‌లో వికలాంగుల పునరావాస కేంద్రాలను డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య సందర్శించారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్వయం ఉపాధి ఇవ్వడం జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పథకం కింద ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, చదువుకు అంగవైకల్యం అడ్డురాదని పేర్కొన్నారు.
PDPL: ఎల్పిజి సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. ఇప్పటికే 12 కేసులు నమోదు చేసి, 29 సిలిండర్లు సీజ్ చేశామన్నారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు అనవసర ఆందోళన చెందవద్దని తెలిపారు. 3, 4 రోజుల్లో సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
MHBD: మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో బుధవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డులో సమస్యలు గురించి వారు సమావేశంలో చర్చించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి-రమేష్ హాజరై, సమస్యలు తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ సోమయ్య, కౌన్సిలర్ ముత్యం వెంకన్న తదరులున్నారు.
KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్‌లో కందుల ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం కందులు క్వింటాకు రూ.7,800 ధర పలుకుతోందని అడత్ వ్యాపారులు తెలిపారు. ఒక రోజులో క్వింటాకు రూ.100 ధర తగ్గిందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా రైతులు మాత్రం అమ్మకానికి ఆసక్తి చూపడం లేదు.
SRCL: తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రాధా తెలిపారు. తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని గురుకుల కళాశాలలో బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. మే 03న జరిగే ప్రవేశ పరీక్షకు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.