• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిరంతర ఎల్పీజీ సరఫరాకు కలెక్టర్ ఆదేశాలు

KMR: రబీ 2025-26 ప్యాడీ కొనుగోలు ఏర్పాట్లపై DPC సమావేశం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగింది. కొనుగోలు కేంద్రాలు, రవాణా, నిల్వ ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా సమీక్షించి నిరంతర రీఫిల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనులకు విరుద్ధంగా వినియోగిస్తున్న 113 కేసుల్లో 160 సిలిండర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.

March 18, 2026 / 09:38 PM IST

డీజే బాక్స్‌లను ధ్వంసం చేసిన పోలీసులు

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని హంటర్ రోడ్డు చౌరస్తాలో బుధవారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఆటోలో ఉన్న డిజే బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ సీఐ పిట్టల వెంకన్న ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది 50 ఆటోలు ఆపి డీజే బాక్స్‌లను పట్టుకున్నారు. వీటిని జెసిబి సహాయంతో ధ్వంసం చేశారు

March 18, 2026 / 09:35 PM IST

హైవే163 G పనులపై అధికారులతో సమీక్ష

WGL: జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే163 G అభివృద్ధి పనుల నేపథ్యంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుపై బుధవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డా, సత్య శారద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు కోరారు.

March 18, 2026 / 09:32 PM IST

కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

WNP: చిన్నంబావి మండల కేంద్రంలో ఉగాది పండగను పురస్కరించుకుని కొల్లాపూర్ నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను కొల్లాపూర్ మాజీ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు.

March 18, 2026 / 09:22 PM IST

భూ వివాదాలు పరిష్కరించాలి: కలెక్టర్

KMM: అటవీ, రెవెన్యూ సరిహద్దు భూ వివాదాలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, అటవీ భూమి సరిహద్దులలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కనకగిరి ఘాట్ అటవీ ప్రాంతం సంబంధించి కొంత భాగం భూమి రికార్డ్, సరిహద్దులు సరిగ్గా నమోదు కాలేదన్నారు.

March 18, 2026 / 09:14 PM IST

నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

MNCL: బెల్లంపల్లి పట్టణం KGBV విద్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. అదనపు తరగతి గదులు-భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రామ్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను సందర్శించి పనులు వేగవంతం చేయాలన్నారు.

March 18, 2026 / 09:06 PM IST

యాసంగి కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం: కలెక్టర్

PDPL: 2025-26 యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. 334 కేంద్రాల ద్వారా సుమారు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, 12.59 లక్షల గన్నీ సంచులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి గతంలో రూ. 2.18 కోట్లు వసూలు చేశామని పేర్కొన్నారు.

March 18, 2026 / 09:01 PM IST

‘పంచాయతీ కార్మికుల సేవలు వెలకట్టలేనివి’

KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం గంగాధర మండల పరిధిలోని వెంకటాయిపల్లి గ్రామ పంచాయతీ కార్మికులను సర్పంచ్ గంకిడి సంధ్యారాణి సత్కరించారు. గ్రామాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఆమె కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ సత్కారం చేసినట్లు తెలిపారు.

March 18, 2026 / 09:01 PM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడియం

JN: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి రాష్ట్ర ప్రజలకు “శ్రీ పరభావ” నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉగాది పండుగకు సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహలతో స్వాగతం పలుకుదామని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిలోని తీపి, చేదు మాదిరిగానే కష్టసుఖకాలు జీవితంలో సహజమన్నారు.

March 18, 2026 / 09:00 PM IST

‘ఈద్ కా తోఫా’ అందజేసిన తహాసిల్దార్

BDK: ప్రజా ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పండుగ కానుకగా ముస్లిం సోదరులకు ‘ఈద్ కా తోఫా’ లను అందజేస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు కరకగూడెం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో 75 ఈద్ కా తోఫా కిట్లను ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలకు MRO వట్టం కాంతయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు.

March 18, 2026 / 09:00 PM IST

రెండు బైకులు ఢీ.. తల్లికొడుకులకు తీవ్రగాయాలు

NLG: శాలిగౌరారం మండలం అడ్లూరు శివారులో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో తుర్కపల్లికి చెందిన తల్లికొడుకులు పార్వతమ్మ, నరసింహాకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి రమేశ్, పైలెట్ యాదగిరి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 18, 2026 / 08:55 PM IST

ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద 90% సబ్సిడీ: కలెక్టర్

GDWL: ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలులో బ్యాంకులు చిత్తశుద్ధితో సహకరించి అర్హులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26పై నిర్వహించిన సమీక్షలో సమావేశం నిర్వహించారు. ఎంప్లాయ్‌మెంట్ సపోర్ట్ స్కీమ్ (ESS) కింద టూ వీలర్లు, త్రీ వీలర్లు, సోలార్ పంప్ సెట్లపై 90 శాతం వరకు సబ్సిడీ వస్తుందన్నారు.

March 18, 2026 / 08:52 PM IST

జనగణ డిజిటల్ ఆధారంగా జరిపించాలి: కలెక్టర్

GDWL: ప్రతి పదేళ్లకోసారి జరిగే జనగణన దేశాభివృద్ధికి దిక్సూచి వంటిది, ఈసారి పూర్తి డిజిటల్ పద్ధతిలో జరిగే ఖచ్చితమైన లెక్కలు తేలుతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష అనారు. బుధవారం గద్వాల ఐడీఓసీలో జిల్లాస్థాయి చార్జ్ అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. 2026లో ఇళ్ల గణన, 27లో జనాభా గణన ప్రక్రియలు ఉంటాయన్నారు.

March 18, 2026 / 08:50 PM IST

‘విద్యారంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు’

MBNR: విద్యా రంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని PDSU జిల్లా అధ్యక్షుడు మారుతి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని మండిపడ్డారు. 1.39 లక్షల కోట్లు విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

March 18, 2026 / 08:50 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా ప్రధానులు

గద్వాల నల్లకుంట ఉర్దూ భవన్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా ఉగాది రంజాన్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి మతసామరస్యాన్ని చాటారు.

March 18, 2026 / 08:50 PM IST