KMM: ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ డా. శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు జరిగిన సమీక్షలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ క్రింద ఖమ్మం జిల్లాకు రూ.5 కోట్ల 16 లక్షలతో 540 యూనిట్‌లను మంజూరు చేసిందని తెలిపారు. ఎస్సీ నిరుద్యోగులు మార్చి 24 లోపు ఆన్ లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో రంజాన్ తోఫా పంపిణీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
VKB: రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం బంట్వారం మండల కేంద్రంలోనీ మసీద్ దగ్గరలో ముస్లిం మహిళలకు బంట్వారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచారం యాదగిరి, మాజీ సర్పంచ్ స్వామి, నర్సింహులు, ప్రభాకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
WNP: తెలుగు నూతన సంవత్సర ఉగాది(పరాభవ నామ సంవత్సర) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు. ఆమె మాట్లాడుతూ పండుగ సందర్భాల్లో అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
SRPT: నడిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1974-75 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన మిత్రులు తమ సహచరుడు, దివంగత షేక్ మౌలానా కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం మౌలానా భార్యను పరామర్శించి, మానవతా దృక్పథంతో రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత మిత్రులంతా కలిసి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.
ASF: ముస్లిం సోదరుల పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని ఈద్గా స్థలాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పరిశీలించారు. పండుగ రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే నేపథ్యంలో ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని ఆమె సూచించారు. రంజాన్ పండుగ శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.
SRCL: గంభీరావుపేట మండలం లింగన్నపేట, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, ముస్తాబాద్,0 పోతుగల్లులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య పథకాలను నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని వివరించారు.
ADB: అర్హులైన ప్రజలందరూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.
JGL: జగన్నాధపురం గ్రామంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీని ఇవాళ ఏర్పాటు చేశారు. కమిషన్ మెంబర్ M. చందన ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం జగిత్యాల అధ్యక్షతన జరిగింది. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి పిల్లల యొక్క హక్కులను కాపాడడం, వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కమిటీ పనిచేయాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
HNK: భీమదేవరపల్లి మండలంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు రంజాన్ కిట్స్ పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐలయ్య అన్నారు.
BHPL: LPG సిలిండర్ల బుకింగ్‌లో సీరియల్ క్రమాన్ని తప్పనిసరిగా పాటించి, వినియోగదారులకు సకాలంలో జాప్యం లేకుండా క్రమబద్ధంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇవాళ ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని LPG డీలర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పారదర్శకంగా సేవలు అందించాలని డీలర్లకు సూచించారు.
NLG: త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి పీహెచ్సీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ క్యాంప్‌ను సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక నేతృత్వంలోని ఉచితంగా పరీక్షలు చేశారు.
BHNG: రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచాలని మండల సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
GDWL: జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో సమస్యలు ఉన్నప్పుడు అధికారులను సంప్రదించిన సమస్య పరిష్కారం దొరకనప్పుడు గతంలో నివేదన యాప్ ద్వారా సమస్యను జిల్లా ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం యాప్ నిలిచిపోయింది. అప్పట్లో దీనిలో సమస్య చేర్చిన వెంటనే మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేది. జిల్లా కలెక్టర్ దీనిని తిరిగి ప్రారంభించాలని ప్రజలు కోరారు.
KNR: నకిలీ వస్తువుల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు సమయంలో నాణ్యత పరిమాణం బట్టి పరిశీలించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఛైర్‌పర్సన్ ఎస్. శ్రీలత అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వినియోగదారుల కమిషన్ ఛైర్‌పర్సన్ ఎస్. శ్రీలత హాజరయ్యారు.