• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఆదిమ గిరిజనులకు ఉద్యోగాలివ్వాలి’

ADB: ఆదిమ గిరిజనులైన నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉమ్మడి జిల్లా ఆదివాసీలతో సమావేశమయ్యారు. టైగర్ జోన్ పరిధిలోని గ్రామాల్లో ఆదివాసీ అటవీ హక్కు చట్టం ప్రకారం రాయితీలు కల్పించాలన్నారు. పట్టా భూమి గల ఆదివాసీలకు సాగునీరు అందించాలనీ పేర్కొన్నారు.

March 9, 2026 / 08:38 AM IST

జూరాల ప్రాజెక్టు పూడికతీత పనులకు మంత్రి ఆదేశాలు

GDWL: మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు ఆదేశించారు. 11.94 TMCల నీటి సామర్థ్యం పూడిక వల్ల 9 TMCలకు పడిపోవడంపై సమీక్ష చేశారు. నిల్వ సామర్థ్యం పెంచి, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు త్వరగా చేపట్టాలని సూచించారు.

March 9, 2026 / 08:36 AM IST

కానిస్టేబుళ్లను అభినందించిన సీఐ నరహరి

KMR: పట్టణంలోని స్టేషన్ రోడ్డులో డీసీబీ బ్యాంక్ ఎదుట ఆదివారం సాయంత్రం సుమారు 55 ఏళ్ల మహిళ మెడలోని బంగారు తాడును లాక్కొని పారిపోతున్న వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. బంగారు చైన్‌తో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్యూటీలో సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లు మధు, కళ్యాణ్‌లను పట్టణ సీఐ నరహరి అభినందించారు.

March 9, 2026 / 08:33 AM IST

రేపు యాదగిరిగుట్టలో హుండీల లెక్కింపు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జె. భవాని శంకర్ తెలిపారు. కొండ కింద గల వ్రత మండపం హాల్ నంబర్ 2లో ఉదయం 7 గంటలకు హుండీల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

March 9, 2026 / 08:32 AM IST

ముగిసిన బంగారిగడ్డ క్రికెట్ టోర్నమెంట్

NLG: నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన BPL 5వ సీజన్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఫైనల్లో నెర్మట జట్టు విజేతగా నిలవగా, బంగారిగడ్డ జట్టు రన్నరప్‌, చండూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ముఖ్య అతిథులుగా MLC నెల్లికంటి సత్యం, మున్సిపల్ ఛైర్మన్ డా. కోడి శ్రీనివాసులు పాల్గొని బహుమతులు అందజేశారు.

March 9, 2026 / 08:30 AM IST

జాతీయ కరాటే పోటీల్లో శంకర్‌పల్లి విద్యార్థుల జోరు

RR: కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన మూడవ జాతీయ కరాటే పోటీల్లో శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన ఎల్‌బీకే బుడోకాన్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 20 మంది విద్యార్థులు పోటీపడగా.. 8 బంగారు, 7 వెండి, 5 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విద్యార్థుల ప్రతిభను మాస్టర్ రవీందర్ యాదవ్ అభినందించారు.

March 9, 2026 / 08:29 AM IST

భూములు తీసుకుంటే రోడ్డున పడతాం: రైతుల ఆవేదన

VKB: ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూములు సేకరిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని పరిగి మండలం రాపోల్, కాళాపూర్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు భూములను పరిశ్రమల పేరిట తీసుకోవడం వల్ల జీవనాధారం కోల్పోతామని వారు వాపోయారు. ఎన్నికల వేళ హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతుల భూములను లాక్కుని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

March 9, 2026 / 08:28 AM IST

సింగరేణి టెండర్లలో భారీ అవకతవకలు: హరీశ్ రావు

SDPT: సింగరేణి ఓవర్ బర్డెన్ (OB) టెండర్లలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ప్రభావంతో కాంట్రాక్టర్లు రింగ్గా ఏర్పడ్డారని, అందుకే SRP OC-II టెండర్ వాయిదా పడుతూ వచ్చిందని ‘X’ వేదికగా విమర్శించారు. బీఆర్ఎస్ పోరాటంతోనే వాస్తవాలు బయటపడుతున్నాయని అని అన్నారు.

March 9, 2026 / 08:28 AM IST

నేడు విద్యార్థులకు మోటివేషనల్ సెషన్

NRPT: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక మోటివేషనల్ సెషన్ నేడు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు T-SAT యూట్యూబ్ ద్వారా నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా IAS పాల్గొని విద్యార్థులకు పరీక్షలపై మార్గనిర్దేశం చేయనున్నారు.

March 9, 2026 / 08:27 AM IST

పినపాక మండలంలో దొంగల హల్‌చల్

BDK: పినపాక మండలం భూపతిరావుపేట మెయిన్ రోడ్డులోని శంకర్ అనే వ్యక్తి దుకాణంలో అర్ధరాత్రి చోరీకి ప్రయత్నం జరిగింది. గమనించిన స్థానికులు చాకచక్యంగా దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు చెగర్షల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

March 9, 2026 / 08:24 AM IST

‘నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’

BHPL: మహదేవపూర్ మండలంలోని ఇసుక క్వారీల వద్ద లారీలపై టార్పాలిన్ (పట్టా) కట్టడం, లెవలింగ్ చేయడం నిషేధించినట్లు SI పవన్ కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం SI మాట్లాడుతూ.. రెండు గ్రూపుల మధ్య వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 9, 2026 / 08:22 AM IST

రేపు విద్యుత్ ఆర్టిజన్ల ధర్నా

WNP: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు TGSPDCL కార్పొరేట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు TVAE JAC రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించిందని వనపర్తి సర్కిల్ ఛైర్మన్ శ్రీకాంత్ తెలిపారు. కార్మికులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కన్వీనర్ దాసరాజు నాగరాజు కోరారు.

March 9, 2026 / 08:22 AM IST

కూసం రాజమౌళి మృతి పట్ల మంత్రి సంతాపం

MLG: వరంగల్ జిల్లా గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గారి మరణం పట్ల మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. గంగదేవిపల్లిని దేశానికే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన సేవలు విశేషమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధిని సాధించవచ్చని కార్యాచరణ ద్వారా నిరూపించిన నాయకుడు రాజమౌళి అన్నారు. రాజమౌళి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

March 9, 2026 / 08:20 AM IST

మహ్మదాబాద్‌లో షార్ట్ సర్క్యూట్.. ఇల్లు దగ్ధం

KMR: జుక్కల్ మండలం మహ్మదాబాద్‌లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. రెడ్డి శంకర్ కుటుంబం ఆదివారం బాన్సువాడకు శుభకార్యానికి వెళ్లారు. అనంతరం వారు తిరిగి వచ్చే సరికి ఇల్లు కాలిపోయింది. స్థానికులు మద్నూర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపు చేశారు.

March 9, 2026 / 08:19 AM IST

జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ పూర్తి

PDPL పెద్దపల్లి సర్కిల్‌లో జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ పూర్తి చేశారు. జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ & ట్రాకింగ్ ప్రక్రియలో 33 కేవీ లైన్లలోని 34 ఫీడర్ల పనులు పూర్తి చేసినట్లు PDPL సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గంగాధర్ తెలిపారు. 11 కేవీ లైన్లలోని 324 ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్లు పెయింటింగ్ చేసినట్లు పేర్కొన్నారు. పోల్ వారీగా పెట్రోలింగ్ సులభం అవుతుందన్నారు.

March 9, 2026 / 08:15 AM IST