KMR: పట్టణంలోని స్టేషన్ రోడ్డులో డీసీబీ బ్యాంక్ ఎదుట ఆదివారం సాయంత్రం సుమారు 55 ఏళ్ల మహిళ మెడలోని బంగారు తాడును లాక్కొని పారిపోతున్న వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. బంగారు చైన్‌తో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్యూటీలో సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లు మధు, కళ్యాణ్‌లను పట్టణ సీఐ నరహరి అభినందించారు.