MNCL: అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న యుద్ధం ఆపాలని సీఐటీయూ అనుబంధ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు డిమాండ్ చేశారు. ఆదివారం చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంతో భారత దేశ ప్రజలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్‌కు ఇబ్బంది పడుతున్న ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
GDWL: ఓటు హక్కు ఆయుధాన్ని చేతబట్టి, మన సమస్యలకు మనమే పరిష్కారం వెతుక్కోవాలి అని బీఎస్పీ గద్వాల జిల్లా అధ్యక్షుడు గద్దెపాగ మణికుమార్ అనారు. ఆదివారం ఇటిక్యాల మండల కేంద్రంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక అవసరాలను గాలికొదిలేసి, కేవలం ఉచిత హామీలతో ప్రజలను వంచిస్తున్నాయన్నారు.
NGKL: కల్వకుర్తి మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంపై మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల కేటాయింపుతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ADB: గ్రామీణ మహిళలకు విద్యపై అవగాహన, విద్యాభివృద్ధి కోసం NIOS పరీక్షా ఎంతో అవసరమని డీఆర్డీఓ పీడీ రాథోడ్ రవీందర్ అన్నారు. ఆదివారం నార్నూర్ మండలంలోని గోండుగూడ TWPS పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో APM జాడి రాజారామ్, SHG సభ్యులు, తదితరులున్నారు.
BHPL: గణపురంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కోటగుళ్లను నేరేడుచర్ల ఎస్సై అజ్మీర రవీందర్ కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆలయ విశిష్టత, ప్రత్యేకతలను ఎస్సైకి వివరించి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గో-మాతలకు ఎస్సై దానా బస్తాలను అందజేశారు.
WNP: వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో పశువులను మేపడానికి వెళ్లిన మేకల శేఖర్ ఒక చెట్టు దగ్గర కవర్ ఉండడం గమనించాడు. దీంతో అతను ఆ కవర్‌ని తీసి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా భయంకరమైన పెద్ద శబ్దంతో పేలిందని స్థానికులు తెలిపారు. దీంతో శేఖర్ ఎడమచేతికి విపరీతమైన రక్తస్రావడం కావడంతో 108 అంబులెన్స్ ద్వారా ప్రాథమిక చికిత్స అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు.
SRD: లోక్-అదాలత్‌లో కేసుల పరిష్కారంలో సంగారెడి జిల్లా రికార్డు క్రియేట్ చేసిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4868 కేసుల్లో రాజీ కుదుర్చామన్నారు. సైబర్ బాధితులకు రూ. 1.42 కోట్లు తిరిగి అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అద్భుత సమన్వయం, సేవా భావంతో పనిచేసిన అధికారులకు అభినందనలు తెలిపారు.
JGL: రాయికల్ అంగడి బజార్ వేసవి కాలం దృష్ట్యా ప్రయాణికులకు ఎండ తీవ్రత లేకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం షెడ్ నెట్ ఏర్పాటు చేశారు. అనంతరం ప్రయాణికుల దాహార్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, కౌన్సిలర్స్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
MLG: ప్రపంచ వారసత్వ సంపదగా (యునేస్కో) గుర్తింపు పొందిన వెంకటాపురం మండలంలోని రామప్ప ఆలయానికి ఈరోజు భక్తులు తరలివచ్చారు. నేడు ఆదివారం సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి రామలింగేశ్వర స్వామి దర్శించుకుని పూజలు చేశారు. అద్భుతమైన కాకతీయుల కట్టడం అందాలను తమ ఫోన్లలో బంధించుకున్నారు.
SDPT: BRS ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ అనంతరం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు.
JN: స్టేషన్‌ఘన్‌పూర్ పల్లగుట్టలో BRS కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. కక్ష సాధింపు చర్యలతో BRS నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గోవర్ధనగిరి అభివృద్ధి పనుల్లో సర్పంచ్ పేర్లు తొలగించారని పేర్కొన్నారు. MLA ప్రజా సమస్యలపై దృష్టి సహకరించాలని కోరారు.
SRPT: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మద్దిరాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ప్రాణం కాపాడటమే తమ సంకల్పమన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు.
NZB: ఆర్మూర్ మండలాలోని చేపూర్ గ్రామంలో ఇవాళ మహిళల కోసం ప్రత్యేకంగా ‘అమ్మకు అక్షరమాల (ఉల్లాస్)’ అనే విద్యా కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. మహిళా సంఘ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సాధికారత, అక్షరాస్యతను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
NLG: ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే మౌనం వల్ల రానున్న రోజుల్లో మునుగోడు ఎడారి కాబోతుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుళ్ళ వద్ద నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే మౌనంగా ఉండడం దారుణమని పేర్కొన్నారు. మనకు వచ్చే 0.5 టీఎంసీలకు 436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశి క్షణ మహా అభియాన్ శిక్షణలో భాగంగా బీజేపీ కరీంనగర్ ఈస్ట్, సెంట్రల్, సౌత్ జోన్ బీజేపీ శ్రేణులకు నిర్వహించిన శిక్షణ ఆదివారం ముగిసిందని తెలిపారు.