• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘నీటి సమస్య రానీయొద్దు’

NZB: రాబోయే వేసవిలో మండలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఇసుక సరఫరా జాప్యం లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

February 26, 2026 / 05:48 PM IST

ఎస్ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో సేవా కార్యక్రమాల్లో ముందున్న ఎస్ఆర్ ఫౌండేషన్ సేవలను కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ ప్రశంసించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విజేతలైన బీబీపేట్ మండల విద్యార్థులను ఆయన అభినందించారు. కాగా, డాకూరి రోహిత్, చిట్టబోయిన వంశీ రాష్ట్రస్థాయిలో మెరిసి పతకాలు సాధించారు.

February 26, 2026 / 05:45 PM IST

నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం: CP

WGL: నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. నూతనంగా విధుల్లోకి చేరిన పోలీస్ జాగిలాలను CP పరిశీలించారు. ఈ నూతన జాగిలాలు ప్రేలుడు పదార్థాలను సులభంగా పసిగడతాయని CP అన్నారు. అదనపు డిసిపిలు శ్రీనివాస్, రవి, తదితరులు ఉన్నారు.

February 26, 2026 / 05:44 PM IST

బస్టాండ్‌లో లగేజీ లభ్యం.. సంప్రదించండి!

KNR: కరీంనగర్ బస్టాండ్ పోలీస్ అవుట్ పోస్ట్ పరిధిలో పది రోజుల క్రితం ఒక సూట్ కేసు లభ్యమైంది. అందులో విలువైన దుస్తులు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆధార్ కార్డు ఉన్నాయి. కార్డులోని ఫోన్ నంబర్‌కు పోలీసులు ప్రయత్నించగా సిగ్నల్ అందడం లేదు. బాధితులు 9440469543, 8712580332ను సంప్రదించి ఆధారాలు చూపి బ్యాగును తీసుకెళ్లాలని పోలీసులు కోరారు.

February 26, 2026 / 05:44 PM IST

హోలీకి ప్రత్యేక రైళ్లు

HYD: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు వివిధ జోన్లలో 1,244 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 ప్రత్యేక రైళ్లు నడవనున్నారు. 40 ట్రిప్పులతో రైల్వే ప్రణాళిక సిద్ధం చేసింది. చర్లపల్లి, తిరుపతి, సికింద్రాబాద్ రాష్టలకు సర్వీస్‌లు ఉన్నాయి.

February 26, 2026 / 05:43 PM IST

జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన

WGL: చెన్నారావుపేట (M) కేంద్రంలోని కోనాపురం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవం సందర్భంగా కార్యక్రమ గోడ పత్రికను ఇవాళ గ్రామ పెద్దలు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన వసతులు కల్పించినట్లు తెలిపారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.

February 26, 2026 / 05:42 PM IST

మూసీ బాధితులకు అండగా బీజేపీ యాత్ర

RR: మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాపూఘాట్ వద్ద ‘పరామర్శ యాత్ర’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీతో పాటు జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.

February 26, 2026 / 05:41 PM IST

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్, కార్పొరేటర్

WGL: 37వ డివిజన్ తూర్పు కోటలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, స్థానిక కార్పొరేటర్ సువర్ణ సురేష్ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని, లబ్ధిదారులకు వెనువెంటనే బిల్లులను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ స్పష్టం చేశారు.

February 26, 2026 / 05:38 PM IST

కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా బాధ్యతల స్వీకరణ

JN: జనగాం జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

February 26, 2026 / 05:37 PM IST

‘ప్రభుత్వ ఆసుపత్రిలో హై రిస్క్ ఆపరేషన్’

PDPL: పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో ఇవాళ 103 కిలోల 45 సంవత్సరాల మహిళకు గర్భకోశానికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు DCHS డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ముత్తారం మండలానికి చెందిన మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరగా పరీక్షలు నిర్వహించి సర్జరీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలన్నారు.

February 26, 2026 / 05:37 PM IST

మెదక్ పోలీసులు జెండా ఊపి ప్రారంభం

MDK: నర్సాపూర్ బీవీఆర్‌ఐటీలో “మెకానికల్ బాజా సే ఇండియా 2026” గురువారం రోజు స్టాటిక్, డైనమిక్ ఈవెంట్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మెదక్ జిల్లా పోలీసులు జెండా ఊపి ప్రారంభించారు. 10 తెలంగాణ జట్లు పాల్గొని సాంకేతిక నైపుణ్యాలు, వాహన రూపకల్పన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. కొత్త హోండా జిక్స్ 430 ఇంజిన్ పరిచయం జరిగింది.

February 26, 2026 / 05:37 PM IST

‘బీసీలపై దాడులను అరికట్టడంలో నిర్లక్ష్యం’

MNCL: బీసీలపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. గురువారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు బీసీలపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. వెంటనే బీసీల రక్షణ, భద్రతకు బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

February 26, 2026 / 05:34 PM IST

ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి ప్రజెంటేషన్

SRPT: జిల్లాలో అమలైన MGNREGA పనులపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పథకం పేరును కేంద్ర ప్రభుత్వం VB-GRAMగా మారుస్తున్న నేపథ్యంలో Ministry of Rural Development (MORD) కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు జిల్లాలో పర్యటిస్తున్నారు.

February 26, 2026 / 05:32 PM IST

‘గురుకులాల్లోనే నాణ్యమైన విద్య’

ADB: గురుకులాల్లో ఉచిత వసతితో నాణ్యమైన విద్య అందుతుందని ఐటీడీఏ PO యువరాజ్ మర్మట్ అన్నారు. గురువారం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల, బోథ్ అడ్మిషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. శివకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

February 26, 2026 / 05:30 PM IST

నమ్మండి.. ఇది చెరువే..!

NRML: నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువు పూర్తిగా ఎండిపోవడంతో క్రీడా మైదానంలా కనిపిస్తోంది. కొద్దిపాటి నీరు మాత్రమే మిగిలి ఉండగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. నీటిలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. చెరువులో పూడికను తొలగించి పునరుద్ధరించాలని పట్టణవాసులు నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు.

February 26, 2026 / 05:30 PM IST