• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వనపర్తిలోని 31వ వార్డులో పారిశుద్ధ్య పనులు

WNP: పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం సిద్ధిస్తుందని వనపర్తి 31వ వార్డు కౌన్సిలర్ బండారు విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం బసవన్నగడ్డ కాలనీలో మున్సిపల్ కార్మికులతో కలిసి ఆమె పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. మురుగు కాలువలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు. పరిశుభ్రత విషయంలో కాలనీవాసులు సహకరించాలని ఆమె కోరారు.

February 27, 2026 / 12:01 PM IST

మూడో రోజు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

MHBD: జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌మీడియట్ పరీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

February 27, 2026 / 12:01 PM IST

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిన నూతన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతి శుక్రవారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త కలెక్టర్‌కి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

February 27, 2026 / 11:58 AM IST

కుల్కచర్లలో తడి-పొడి చెత్త బుట్టల పంపిణీ

VKB: స్వచ్ఛ గ్రామాల లక్ష్యంతో కుల్కచర్ల మండలంలోని చెరువు ముందలితండా గ్రామపంచాయతీలో శుక్రవారం తడి, పొడి చెత్త కోసం వేర్వేరు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, వ్యర్థాలను వేరు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని శుభ్రతపై అవగాహన పెంపొందించారు.

February 27, 2026 / 11:57 AM IST

పాలకుర్తి ఎస్సైకు ఘన వీడ్కోలు

JN: పాలకుర్తి మండల కేంద్రంలో 42 ఏళ్లపాటు పోలీస్ శాఖలో సేవలందించిన పాలకుర్తి ఎస్సై శ్రీ ఎం.లింగారెడ్డి ఈనెల 28న పదవీ విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం యువకులు ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సేవాకాలంలో సుమారు 150 రివార్డులు అందుకున్న లింగారెడ్డి బస్‌స్టాండ్ వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి యువకులు పాలాభిషేకం చేశారు.

February 27, 2026 / 11:55 AM IST

ప్రేమ వివాహం.. యువకుడిపై యువతి సోదరుడి దాడి

MDCL: ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై కొందరు దుండగులు దాడి చేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్‌ను రామలింగంపల్లి గ్రామ శివార్‌కు పిలిపించి యువతి సోదరుడు, అతని స్నేహితులు కారం చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

February 27, 2026 / 11:54 AM IST

రేపు జాతీయ సైన్స్ దినోత్సవం: డీఈవో

NLG: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సంబరాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి తెలిపారు. పాఠశాలల్లో సెమినార్లు, పరిశోధనలపై అవగాహన, సైన్స్ ప్రయోగాలు, వ్యాసరచన, క్విజ్ పోటీలు, పుస్తకాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.

February 27, 2026 / 11:53 AM IST

ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైరు చోరీ

SRD: రాయికోడ్ మండలం పంపాడు గ్రామ శివారులోని మిషన్ భగీరథకు సంబంధించిన ఇంటెక్వల్ వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న ట్రాన్సఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.1.50 లక్షల విలువ గల ఆయిల్, కాపర్ వైరును ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్ఐ అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

February 27, 2026 / 11:49 AM IST

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి

KMM: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గామాత ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని, అమ్మ దయా కరుణా కటాక్షాలతో తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి ప్రార్థించారు.

February 27, 2026 / 11:46 AM IST

మెగా జాబ్ మేళను సద్వినియోగం చేయాలి: SI

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మర్చి 10వ తేదీన జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేయాలనీ SI ప్రణయ్ అన్నారు. శుక్రవారం గాదిగూడ పోలీస్ స్టేషనులో సిబ్బందితో కలిసి జాబ్ మేళ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ఇది సుదీర్ఘమైన అవకాశమని పేర్కొన్నారు.

February 27, 2026 / 11:45 AM IST

సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో అగ్నిప్రమాదం

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ మధ్య గల ఖాళీ స్థలంలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండిన చెట్లు, పొదలకు మంటలు వ్యాపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను ఆర్పివేశారు. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సీపీ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

February 27, 2026 / 11:43 AM IST

‘ప్రజాతీర్పును అధికార బలం వెక్కిరిస్తోంది’

RR: ఇబ్రహీంపట్నంలో ప్రజాతీర్పును అధికార బలం వెక్కిరిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 15 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినా, 8 స్థానాలున్న కాంగ్రెస్ కూడా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కిడ్నాప్ రాజకీయాలు, అధికారులపై ఒత్తిళ్ల నేపథ్యంలో మున్సిపల్ రాజకీయ చదరంగంలో ఎవరికెవరు చెక్ పెడతారో చూడాలి.

February 27, 2026 / 11:41 AM IST

కౌటాలో శబరిమాత ఆలయ వార్షికోత్సవం

ADB: బోథ్ మండలంలోని కౌటా గ్రామంలో శబరిమాత ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 27, 2026 / 11:36 AM IST

మాజీ సర్పంచ్ కుటుంబానికి మంత్రి పరామర్శ

MNCL: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తండ్రి గోనె పోషం ఇటీవల మృతి చెందారు. విషయం తెలిసిన మంత్రి వివేక్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 11:35 AM IST

బ్రిడ్జి పిల్లరుకు పగుళ్లు.. రాకపోకలు బంద్

JGL: మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వరదకాలువ (82.03km) బ్రిడ్జికి సంబంధించిన ఒక పిల్లరుకు పగుళ్లు ఏర్పడడంతో తాత్కాలికంగా బ్రిడ్జిని ఇరిగేషన్ అధికారులు మూసేశారు. ఈ బ్రిడ్జిపై నుంచి క్రషర్ల భారీ వాహనాల రాకపోకల కారణంగా బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి మూసేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

February 27, 2026 / 11:35 AM IST