• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

10 రోజుల శిక్షణా శిబిరంలో ఉమ్మడి DCC అధ్యక్షులు

NZB: వికారాబాద్‌లో నేటి నుంచి పది రోజుల పాటు నిర్వహించే జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరానికి ఉమ్మడి NZB జిల్లా నేతలు హాజరయ్యారు. NZB జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్ రెడ్డి, KMR జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీనియర్ నాయకులు వీరికి దిశానిర్దేశం చేశారు.

February 21, 2026 / 04:26 PM IST

కర్ల రాజేశ్ లాకప్ డెత్.. సీఎం మౌనం వీడాలి: మందకృష్ణ

HYD: కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరులో జరిగిన కర్ల రాజేశ్ లాకప్ డెత్ జరిగి నేటికి 95 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఓయూలో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాజేశ్ లాకప్ డెత్‌పై సీఎం మౌనం వీడాలని అన్నారు. PS సీసీ ఫుటేజ్ని పరిశీలించి రీ పోస్టుమార్టం నిర్వహించాలన్నారు.

February 21, 2026 / 04:25 PM IST

ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు: డీఈవో

SRD: జిల్లాలోని అన్ని స్కూల్స్‌లో 1 -9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఎస్ఎ-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

February 21, 2026 / 04:19 PM IST

HYDలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పాటిల్ పర్యటన

HYD: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ పాటిల్ ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పాటిల్‌కు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఘన స్వాగతం పలికారు. నగరంలోని వివిధ కార్యక్రమాలలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

February 21, 2026 / 04:16 PM IST

ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ

JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులకు సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి భూమి ప్రదేశం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఉన్న బండలను తొలగించి, ప్రహరి గోడ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆలయ కమిటీ తెలిపారు. సర్పంచ్‌తో పాటు, మాజీ ఎంపీటీసీ, మాజీ విండో డైరెక్టర్, కుల సంఘల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:15 PM IST

​నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు ఇంటర్ ప్రశ్నపత్రాలు

SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి సెట్-A ప్రశ్నపత్రాలు శనివారం నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. పరీక్షల నిర్వాహకులు వీటిని పోలీస్ స్టేషన్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ​నడిగూడెంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 04:15 PM IST

ప్రత్యేక తరగతులకు తప్పకుండా హాజరు కావాలి: కలెక్టర్

MDK: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ చిన్నశంకరంపేట్ మండలం సూరారం జడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి, సబ్జెక్టులవారీగా చదివే విధానం వివరించారు. తల్లిదండ్రులు హాజరుపై దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రోత్సహించాలని అన్నారు.

February 21, 2026 / 04:14 PM IST

ఉచిత బస్సును ప్రారంభించిన కలెక్టర్

NRPT: ఉట్కూరు మండల పరిధి బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా దాతలు సహకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్, శ్రీ అంబత్రాయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరశ్రీతో కలిసి ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు సదుపాయాని వినియోగించుకోవాలని కోరారు.

February 21, 2026 / 04:13 PM IST

పేదింటి ఆడబిడ్డ వివాహానికి ట్రస్టు చేయూత

పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఐశ్వర్య వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు సహాయం అందించింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం, పెళ్లి చీరను అందజేశారు. గత 21 ఏళ్లుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 04:13 PM IST

తెలంగాణ సాహితీ ఉత్సవాల్లో జిల్లా రచయితలు

NGKL: హైదరాబాద్ ఏవీ కాలేజీలో ప్రారంభమైన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు జిల్లా కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శనివారం జరిగిన మొదటిరోజు సమావేశంలో ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కథా రచయిత వహీద్ ఖాన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జిల్లా కవులు తాము రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు.

February 21, 2026 / 04:10 PM IST

బాన్సువాడ గొడవ.. వారిపై కేసులు: ఎస్పీ

KMR: బాన్సువాడ రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఘటనపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ క్రమంలో వ్యక్తిపై దాడి చేసిన వారు, రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఆందోళన చెందకుండా తమ రోజువారీ పనులు చేసుకోవాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 04:09 PM IST

నేటి మార్కెట్ ధరలు.. వేరుశనగకు రూ.10,621

MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు పంట ఉత్పత్తుల ధరలను కార్యదర్శి అశ్వక్ హైమద్ వెల్లడించారు. వేరుశనగ గరిష్టంగా రూ.10,621, పత్తి రూ.6,301 పలికింది. మినుములకు గరిష్ట ధర రూ.8,063 లభించగా, మొక్కజొన్న రూ.1,889 ధర పలికినట్లు తెలిపారు. ఆయా పంటల కనిష్ట ధరలు వేరుశనగకు రూ.4,669,పత్తికి రూ.4,001,మినుములకు రూ.7,150,మొక్కజొన్నకు రూ.1,701గా నమోదయ్యాయి.

February 21, 2026 / 04:08 PM IST

‘బహిరంగ సభను జయప్రదం చేయండి’

BDK: కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు నిండిన సందర్భంగా ఫిబ్రవరి 27న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఇల్లెందు IFTU కార్యాలయంలో పార్టీ నాయకులు వాల్ పొస్టర్‌లను ఆవిష్కరించారు. డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందన్నారు.

February 21, 2026 / 04:08 PM IST

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు నడిగూడెం వాసి ఎంపిక

SRPT: నడిగూడెం మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన కాసాని సాయి 74వ జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన సాయిని మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కోటి, కార్యదర్శి కరుణాకర్ అభినందించారు. ఈ సందర్భంగా సాయికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు వీరేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 04:08 PM IST

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు: ఏసీపీ

KMR: కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

February 21, 2026 / 04:07 PM IST