• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలి’

MBNR: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో అనిల్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

February 23, 2026 / 01:20 PM IST

నల్గొండలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

NLG: ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు.

February 23, 2026 / 01:19 PM IST

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

NGKL: ఊర్కొండ మండలం జగబోయిన్‌ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి రూ.5,000 నగదును అందజేశారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని ధ్యాప నిఖిల్ రెడ్డి భరోసా ఇచ్చారు.

February 23, 2026 / 01:18 PM IST

సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

BDK: ఆళ్లపల్లి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కళ్యాణ లక్ష్మీ, సీఎం  సహాయ నిధి (CMRF) చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ పథకం కింద 24 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 24,02,784 పంపిణీ చేసి, పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించారు.

February 23, 2026 / 01:16 PM IST

‘రైతులందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి’

SDPT: ప్రభుత్వం అందించే పథకాలు,సబ్సిడీలు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కౌన్సిలర్ వనం రమేష్ సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన సోమవారం పరిశీలించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే స్పందించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

February 23, 2026 / 01:16 PM IST

ప్రత్యేక అలంకరణలో కాళికా దేవి

MDK: కాళికా మాత ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కాళికా మాత ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అర్చకులు ఆశీస్సులు అందజేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.

February 23, 2026 / 01:14 PM IST

డీఆర్‌వో సంగీతకు జర్నలిస్టుల వినతి

RR: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్‌వో సంగీతకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఉన్న జిల్లానే కాకుండా తెలంగాణ ఎర్త్ వైడ్ ఫ్రీ బస్సు పాస్ ఇవ్వాలన్నారు.

February 23, 2026 / 01:13 PM IST

మంత్రిని కలిసిన కల్వకుర్తి వైస్ ఛైర్మన్

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ ఇవాళ హైదరాబాదులోని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్‌ను మంత్రి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్వకుర్తి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.

February 23, 2026 / 01:10 PM IST

ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా జైనథ్ రాస్తారోకో

ADB: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జైనథ్ బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. బస్టాండ్ ఆవరణలో గంటపాటు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

February 23, 2026 / 01:09 PM IST

అంబేడ్కర్ విగ్రహానికి జ్ఞానమాల

MDCL: కీసర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 211వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని అధ్యక్షుడు కర్రె గణేశ్ ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ గౌడ సంఘం నాయకుడు వనందాస్ లక్ష్మి నారాయణ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కీసర గ్రామశాఖ అధ్యక్షుడు తుడుం బాలరాజ్ పాల్గొన్నారు.

February 23, 2026 / 01:08 PM IST

రైతుబంధు రాక ఇబ్బంది పడుతున్న రైతన్నలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి పంట సాగు చేస్తున్న రైతులు రైతు భరోసా పథకం నిధులు ఇంకా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట వేసే సమయంలో ఎరువులు, విత్తనాలు, కూలీలు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేలా రూపొందించిన ఈ పథకం ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరగా రైతుబంధు ఇవ్వాలని కోరారు.

February 23, 2026 / 01:08 PM IST

‘ఆసక్తి కలిగించేలా బోధించాలి’

SRD: కోహీర్ మండలంలోని గురుజువాడ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు బోధనాభ్యసన సామగ్రిని విరివిగా వినియోగించి విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యే లా విద్యా బోధన చేయాలని సూచించారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించే విధంగా బోధించాలన్నారు.

February 23, 2026 / 01:07 PM IST

బీసీలు అంటే ఎందుకింత చిన్నచూపు

KMM: బీసీలు అంటే ఎందుకంట చిన్నచూపు ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పి ఇలాంటి దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని రజక సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు జూపల్లి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ చాకలి కులానికి సంబంధించిన పేద కుటుంబం పై దాడిని ఖండించారు.

February 23, 2026 / 01:06 PM IST

పేదలకు ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

KMM: పెనుబల్లి మండలం రామచంద్రరావు బజార్ గ్రామంలో నంద్యాల కృష్ణవేణి గోపిలకు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దయానంద్ హాజరయ్యారు. పేదవారికి ఇల్లు అందించడం ముఖ్య లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారని వారు తెలిపారు.

February 23, 2026 / 01:06 PM IST

పేదల ఇళ్ల కూల్చివేతలపై UDF ధ్వజం..!

HYD: మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం మండిపడింది. దశాబ్దాలుగా ఉంటోన్న వారిని బఫర్ జోన్ పేరుతో రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించింది. DPR సిద్ధం కాకుండానే తొలగింపులు చేపట్టడం బాధ్యతారాహిత్యమని కన్వీనర్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్, టూరిజం బిజినెస్ కోసం సామాన్యుల గూళ్లు కూల్చొద్దని కోరారు.

February 23, 2026 / 01:02 PM IST