• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

NZB: వర్ని మండలం అక్బర్ నగర్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్- లారీ ఢీకొన్న ఘటనలో పాత వర్నికి చెందిన భూమయ్యకు గాయాలయ్యాయి. వర్ని 108 సిబ్బంది రామకృష్ణ, గౌస్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 08:40 AM IST

మూసీ పేరుతో వ్యాపారం వద్దు: హరీశ్ రావు

SDPT: మూసీ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మూసీ ప్రాజెక్టు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. సీఎం చేసే ప్రతి పని వెనుక భూముల పంచాయతీ, వ్యాపార ప్రయోజనాలే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు.

February 23, 2026 / 08:39 AM IST

కొనసాగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితుల ఆందోళన

PDPL: ముత్తారం మండలంలోని లక్కారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించే వరకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు కేవలం సర్వేలతో కాలయాపన చేస్తూ తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, అప్పటివరకు పోరాటం ఆపేది లేదన్నారు.

February 23, 2026 / 08:38 AM IST

ఈదురు గాలుల బీభత్సం: మొక్కజొన్న పంట ధ్వంసం

MHBD: బయ్యారం మండలం బీరొనిమడుగు, పంది పంపుల, అల్లిగూడెం గ్రామాల్లో ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో 30 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది. చేతికి వచ్చిన పంట నెల రావడంతో అన్నదాతలు కన్నీటి పరేమయ్యారు. ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

February 23, 2026 / 08:38 AM IST

వద్దిపట్లలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లలో ముత్యాలమ్మ విగ్రహానికి ఆ కాలనీ ప్రజలు భక్తి శ్రద్దలతో ఘనంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. రానున్న రోజులలో గుడి నిర్మాణం చేసుకుని పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ నాయకుడు దున్న ముత్యాలు అన్నారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామంపై ఉండాలని అన్నారు. కార్యక్రమంలో దున్న ఆంజనేయులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:35 AM IST

ఎమ్మెల్యే సహకారంతో సొంతింటి కల నెరవేరింది

WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని ముచింపుల గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సొంతింటి కల నెరవేరిందని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కవిత, దేవేందర్ తెలిపారు. అనంతరం వారు HIT TVతో మాట్లాడుతూ.. గత 10 సం,గా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సర్పంచ్ శేఖర్ గౌడ సహకారంతో నెరవేరిందని అన్నారు.

February 23, 2026 / 08:34 AM IST

దైవారాధనతో మానసిక ప్రశాంతత: MLA

ADB: దైవారాధనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో సంత్ గాడిగే బాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.

February 23, 2026 / 08:30 AM IST

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి: ఆడే గజేందర్

ADB: బోథ్ నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా తనవంతుగా కృషి చేస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, నారాయణ, సంతోష్ తదితరులున్నారు.

February 23, 2026 / 08:30 AM IST

‘నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి శిక్షణ’

PDPL :పెద్దపల్లి RSETI సంస్థ 2026–27 సంవత్సరానికి గ్రామీణ నిరుద్యోగ యువత కోసం పలు స్వయం ఉపాధి శిక్షణలను అందించనున్నట్లు, డైరెక్టర్ రాకేష్ పరీష తెలిపారు. మగ్గం వర్క్, జ్యువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీసెస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్, పాపడ్-పికిల్స్ తయారీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆసక్తిగల వారు 9392221907ను సంప్రదించాలన్నరు.

February 23, 2026 / 08:29 AM IST

చింతలకుంటలో అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

GDWL: కేటీదొడ్డి మండలం చింతలకుంటలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న యజమాని లక్ష్మణ్, డ్రైవర్ రంగస్వామిలపై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. స్థానికుల సహకారం కోసం పరిశీలనలు కొనసాగిస్తున్నారు.

February 23, 2026 / 08:29 AM IST

“ఉమ్మడి WGL మున్సిపాలిటీల్లో “కో-ఆప్షన్” సభ్యులపై ఆసక్తి”

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీల్లో పాలక వర్గాల ఏర్పాటు పూర్తయిన తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి “కో-ఆప్షన్” సభ్యుల ఎంపిక పై పడింది. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ నామినేటెడ్ స్థానాల కోసం ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, పార్టీ కోసం కష్టపడిన ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయాల్లో రాజకీయ సందడి నెలకొంది.

February 23, 2026 / 08:27 AM IST

బాల్క సుమన్‌ కస్టడీ పిటిషన్‌ విచారణ

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో మాజీ MLA బాల్క సుమన్‌కు బెయిల్, పోలీసుల కస్టడీ పిటిషన్లపై సోమవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. బెయిల్ మంజూరవుతుందా? లేక పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీసుకునే నిర్ణయం క్యాతనపల్లి రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశముంది.

February 23, 2026 / 08:22 AM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి

మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో 21,884 మంది విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు సౌకర్యాల కోసం కనీస వసతులు అందించినట్లు అధికారులు తెలిపారు.

February 23, 2026 / 08:22 AM IST

చిన్నారి మృతికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ

NZB: నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతికి నిరసనగా జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు DSP కార్యకర్తలు ఈ ర్యాలిలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 08:21 AM IST

నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి

SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజలు, దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 08:21 AM IST