• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మియాపూర్‌లో విద్యార్థి ఆత్మహత్య

HYD: మియాపూర్‌లోని సాయినగర్‌లో శంకర్(18) అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది పదో తరగతిలో ఫెయిల్ అయిన శంకర్, తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బీదర్ వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 06:18 AM IST

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

NLG: ఇంటర్‌ మీడియట్‌ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియేట్‌ విద్యాశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 57,353 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

February 25, 2026 / 06:16 AM IST

‘ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు’

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రికి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. నిన్న హైదరాబాద్‌లోని సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన రిమ్స్‌ అభివృద్ధిపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య సేవలను గురించి వివరించారు.

February 25, 2026 / 06:13 AM IST

కలెక్టర్, ఎస్పీలను కలిసిన మున్సిపల్ ఛైర్ పర్సన్

GDWL: జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావులను మున్సిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ శంకర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాతో సన్మానించి, గద్వాల పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ ప్రజల సంక్షేమానికి తమవంతు మద్దతు ఉంటుందని తెలిపారు.

February 25, 2026 / 06:13 AM IST

కూడలిలో ఇసుక‌ డంప్‌లు సీజ్

SRPT: అనుమతి లేకుండా ఇసుక రవాణాతో పాటు కూడలిలో అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపులపై, మంగళవారం కూడలిలో ఉన్నటువంటి ఇసుక డంపుల మీద రెవిన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.ఈ దాడుల్లో అక్రమంగా నిలువ చేసినటువంటి ఆ డంపులను గుర్తించి 17 డంపులను అధికారులు సీజ్ చేశారు. ఈ డంప్‌లలో ఇసుక సుమారు 202 ట్రక్కులు అవుతాయని అధికారులు తెలిపారు.

February 25, 2026 / 06:13 AM IST

‘జిల్లాలోని మత్స్యకారులు దరఖాస్తు చేసుకోండి’

BHPL: భూపాలపల్లి జిల్లాలోని మత్స్యకారులు, మత్స్య కృషీవలులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2025-26 కింద మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ మంజూరు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వై. విజయ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అర్హులైన మత్స్యకారులు జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మార్చి 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

February 25, 2026 / 06:12 AM IST

రాష్ట్ర సేపక్ తక్రా పోటీల్లో జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం

KMR: వనపర్తి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో ద్వితీయ స్థానంలో సాధించింది. ఈ విషయాన్ని జిల్లా క్రీడాధికారి రంగా వెంకటేశ్వర్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, కార్యదర్శి కుమ్మరి నరేశ్, కోశాధికారి సతీశ్ జట్టు సభ్యులను అభినందించారు.

February 25, 2026 / 06:11 AM IST

పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిషేదం

NZB: మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

February 25, 2026 / 06:07 AM IST

రూ.2 లక్షల సాయంతో లబ్ధిదారికి భరోస

MDK: కొల్చారం మండలం తుక్కపూర్‌లో మంగలి వసంతకు రూ.2 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును ఎస్‌బీఐ రంగంపేట అధికారులు అందజేశారు. PMJJBY పథకం ద్వారా మంజూరైన ఈ ఆర్థిక సాయాన్ని సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లు పంపిణీ చేశారు. ఆపద కాలంలో ప్రభుత్వ బీమా పథకాలు పేద కుటుంబాలకు కొండంత భరోసా ఇస్తాయని అధికారులు తెలిపారు.

February 25, 2026 / 06:06 AM IST

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం..!

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన చెంది బాలా గౌడ్ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజానర్సింహా, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మంగళవారం ఆయనను పరామర్శించారు. బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం నగదు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు.

February 25, 2026 / 06:05 AM IST

రోడ్డు విస్తరణకు రూ.33 కోట్లు మంజూరు

KMM: ముదిగొండ మండలంలో రహదారుల అభివృద్ధికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ నిధులు మంజూరు చేశారు. తల్లంపాడు – ముదిగొండ రోడ్డు విస్తరణకు రూ.33 కోట్లు కేటాయించడంతో ఏళ్లనాటి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థుల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.

February 25, 2026 / 06:04 AM IST

మూడు కార్పొరేషన్ల వెబ్ సైట్లు ఇవే..!

HYD: 300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలు కాగా.. GHMC, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్ సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్ సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్ సైట్లలో ప్రజలు సేవలు పొందే అవకాశం ఉందని తెలియజేశారు.

February 25, 2026 / 06:03 AM IST

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే రోహిత్

MDK: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో హవేలిఘనపూర్ మండల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందజేశారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:03 AM IST

కొత్త పాలక వర్గానికి సమస్యల స్వాగతం!

VKB: కొడంగల్లో బుగ్గప్ప హోటల్ వద్ద రోడ్డు అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే విధంగా తాండూర్ రోడ్డులో బాలాజీ సూపర్ మార్కెట్ పక్కన మురుగు కాలువ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు రహదారుల వద్ద మురుగు కాలువలు ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

February 25, 2026 / 06:02 AM IST

హత్యాయత్నం కేసులో కార్పొరేటర్ అరెస్టు

WGL: ఆర్థిక లావాదేవీల వివాదంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ వరంగల్ కార్పొరేటర్ శ్రీమన్నారాయణను మంగళవారం సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దిల్సుఖ్‌నగర్‌కు చెందిన చీదర శ్రీనివాస్ వద్ద రూ.35 లక్షల అప్పు, చెక్కుల వివాదంలో దాడిచేసిన కేసులో కార్పొరేటర్ పాత్ర బయట పడడంతో పోలీసులు అరెస్టు చేశారు.

February 25, 2026 / 06:01 AM IST