BDK: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం కరకగూడెం మండలం చొప్పాల గ్రామ పరిధిలోని గొడుగుబండ వద్ద వట్టివాగు ప్రాజెక్టును పరిశీలించారు. రైతులకు రెండుపంటలు పండేలా ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని సూపర్వైజర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BHPL: గోరికొత్తపల్లి(M) నిజాంపల్లి గ్రామంలోని 1వ వార్డులో బుధవారం గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ ఆధ్వర్యంలో GP కార్మికులు సైడ్ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
MLG: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద అర్హత గల ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 25వ తేదీ లోపు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MHBD: ద్విచక్ర వాహనాలపై జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే వారందరికీ హెల్మెట్ తప్పనిసరి అని ఎస్పీ డాక్టర్ శబరీష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిని కలవడానికి వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులు, బాధితులు, కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో సహా ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా కార్యాలయ ప్రాంగణంలోకి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బందికి స్పష్టం చేశారు.
NZB: నవీపేట్ మండల రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు యూరియా బుకింగ్ విధానంలోమార్పులు చేసినట్లు ఏఈఓ వినోద్ తెలిపారు. ఇకపై రైతులు ఇతర మండలాల్లోయూరియా బుక్ చేసే అవకాశం రద్దు చేసి,కేవలం తమ సొంత మండలంలోనే బుక్ చేసుకునేలా యాప్‌ను అప్‌డేట్ చేశారు. నేటి నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందని, దీని వల్ల స్థానిక రైతులకు యూరియా లభ్యత సులువవుతుందని అధికారులు పేర్కొన్నారు.
NLG: బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం దేవరకొండలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని నిరసన వ్యక్తం చేశారు.
వనపర్తి: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పక్కా సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. బాధితురాలికి న్యాయం జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు సంఘంలో మంచి సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు.
SRPT: నడిగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ నిధులతో ప్రీ-ప్రైమరీ విభాగం సరికొత్తగా ముస్తాబవుతోంది. చిన్నారులను ఆకట్టుకునేలా తరగతి గది గోడలపై అక్షరాలు, అంకెలు, పక్షులు, జంతువుల చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరిస్తున్నారు. ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
VKB: ఇంటర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తొలిరోజు తడబాటుకు గురయ్యారు. తాండూరు పట్టణంలో ముగ్గురు విద్యార్థులు హడావుడిలో పొరపాటున వేరే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ బలరాం, మరో వ్యక్తి వారిని తమ బైకుపై ఎక్కించుకుని వారి పరీక్షా కేంద్రానికి సమయానికి చేర్చారు.
MHBD: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎస్సై గిరిధర్ రెడ్డి సూచించారు. బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా గూడూరు మండలంలో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ ఉండాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
SRD: ఖేడ్ నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యాలు, అభిప్రాయాలు సూచనలు తెలుసుకునేందుకుగాను రేపు డయల్ యువర్ DM నిర్వహిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26 గురువారం ఉదయం 11:00 నుంచి 12:00 వరకు డయల్ యువర్ DM కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు బస్సు సమస్యల సూచనలు ఇచ్చేందుకు DM నెంబర్ 9959223170కు కాల్ చేయాలని కోరారు.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్స పద్ధతిలో తొలిసారి ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, నేడు వారిని డిశ్చార్జ్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు మరియు ప్రోత్సహించేందుకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య ఉచితంగా పెన్నులు అందించారు. సమయాన్ని వృథా చేయకుండా, ఏకాగ్రతతో చదివి, మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
NLG: పట్టణంలోని ప్రగతి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించే పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద BNS సెక్షన్ 163 (144 సెక్షన్) అమల్లో ఉంటుందని, కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా తిరగడం నిషేధమని హెచ్చరించారు.
KMR: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. మద్నూర్ కేంద్రానికి అశ్విని అనే విద్యార్థిని నిర్ణీత సమయం కంటే కొంత ఆలస్యంగా చేరుకుంది. అధికారులు నిబంధనల మేరకు ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో పరీక్ష రాయలేకపోయింది.విద్యార్థిని కన్నీటి పర్యంతమవుతూ అక్కడి నుంచి వెనుదిరిగింది.