• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఆరుగురు విద్యార్థుల గైర్హాజరు’

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో శనివారం జరిగిన సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షలో జూనియర్ కళాశాలలో 285 విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరు, ఆదర్శ కళాశాలలో 145 విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరైనట్లు ఇరు కళాశాలల ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాస్ తెలిపారు. మొత్తంమీద పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు వారు సూచించారు.

February 28, 2026 / 03:19 PM IST

‘నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల నిర్వహణ’

MNCL: మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో నిర్వహిస్తున్న సూర్యతేజ పారామెడికల్, లక్ష్మి నర్సింగ్ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విద్యా సంస్థల్లో చేరి విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 03:16 PM IST

ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ సహజం: ఎస్పీ

SRD: ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్ఐ దశరథ్, ఏఎస్ఐ యాదగిరిలను ఎస్పీ కార్యాలయంలో శనివారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో అనేక సంవత్సరాలు పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏవో కల్యాణి, ఏఆర్ డీఎస్పీ నరేందర్ పాల్గొన్నారు.

February 28, 2026 / 03:16 PM IST

నిరుద్యోగులకు గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ

WNP: గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేసే అరుదైన అవకాశాన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ తరగతులు ప్రారంభించారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు.

February 28, 2026 / 03:16 PM IST

అవినీతి అనకొండల గుండెల్లో ACB ‘దడ’

HYD: సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే.

February 28, 2026 / 03:15 PM IST

ఇన్నోవేషన్ ఛాంపియన్ అవార్డు సాధించిన రుక్మాపూర్ విద్యార్థులు

KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్ విద్యార్థులు ఆర్.సామ్రాట్, బి.హేమచంద్ర రాష్ట్ర స్థాయి రోబోటిక్ ఎగ్జిబిషన్‌లో పాల్గొని ‘ఇన్నోవేషన్ ఛాంపియన్’ అవార్డు గెలుచుకున్నట్లు డైరెక్టర్ రాజా దత్త తెలిపారు. HYDలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ‘విద్యావేత్తలలో రోబోటిక్స్ ఆవిష్కరణలలో సవాళ్ళు’ అనే అంశంలో 7 లెవెల్స్ విజయవంతంగా పూర్తి చేసి అవార్డు సాధించారు.

February 28, 2026 / 03:15 PM IST

రికార్డు స్థాయిలో కొనుగోళ్లు

VKB: తాండూరులోని మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. ఒకే రోజు రూ. 2 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. శుక్రవారం ఈ-నామ్ పాత సాఫ్ట్‌వేర్ ద్వారానే పంటల కొనుగోలుకు వ్యాపారులకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రెండు రోజులుగా పేరుకుపోయిన ఉత్పత్తులకు ఒకేరోజు విక్రయాలు చేపట్టారు.

February 28, 2026 / 03:15 PM IST

సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్

KMR: జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. పాఠశాల ఆహ్వానం మేరకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్తులు తమ సృజనాత్మాకతో వివిధ రకాల ప్రదర్శనలను అతిథులు ఔత్సాహికంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాడు కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్ ఉన్నారు.

February 28, 2026 / 03:14 PM IST

అభివృద్ధిలో బిల్డర్లు భాగస్వాములు కావాలి: మంత్రి

NLG: బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శంషాబాద్‌లో ఇవాళ నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ మీటింగ్ 2025–26కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘విజన్ 2047’తో రోడ్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో బిల్డర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

February 28, 2026 / 03:12 PM IST

కుమ్మెర బాధితులతో కలిసి OUలో నిరసన

NGKL: కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో బాధితులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీసులు బాధితులకు అండగా నిలవడంలో విఫలమయ్యారని విమర్శించారు.

February 28, 2026 / 03:08 PM IST

శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఎన్నిక

SRCL: చందుర్తి మండలం లింగంపేట శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీని శనివారం గ్రామ సర్పంచ్ కొక్కుల నరేష్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని కమిటీని ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఐలేని వేణుగోపాలరావు, ప్రధాన కార్యనిర్వహణాధికారిగా జలగం వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులుగా దొకే రాజయ్యలను ఎన్నుకున్నారు.

February 28, 2026 / 03:08 PM IST

స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొన్న తాహసీల్దార్

WGL: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆదేశాల మేరకు శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని మేడపల్లి ZPSS హై స్కూల్‌లో విద్యార్థులకు స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాహసీల్దార్ ముప్పు కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్ఫూర్తి కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో తోడ్పడుతుందని అన్నారు.

February 28, 2026 / 03:06 PM IST

కౌన్సిలర్‌గా ప్రమాణం.. ఆ వెంటనే సమస్యలపై ఫోకస్

సిద్దిపేట: చేర్యాల పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న మిషన్ భగీరథ నీటి సమస్య పరిష్కారమైంది. ఎన్నికల నుంచి నీరు రాక కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులపై నాలుగో వార్డు కౌన్సిలర్ నిమ్మ సుప్రజ రాజీవ్ రెడ్డి తక్షణమే స్పందించారు. పదవి చేపట్టిన మరుసటి రోజే పైప్‌లైన్ మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.

February 28, 2026 / 03:05 PM IST

ఉచిత నేత్ర వైద్య శిబిరం

JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సర్పంచ్ పుల్లూరు ఉమాదేవి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 85 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 30 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి ఆసుపత్రికి తరలించినట్లు లయన్స్ క్లబ్ సభ్యుడు అంగడి ఆనంద్ తెలిపారు.

February 28, 2026 / 03:05 PM IST

‘NHM ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి’

ASF: జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న 17 వేల మంది ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని NHM JAC నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజకు వినతిపత్రం అందజేశారు. 78 కేడర్లలో సేవలందిస్తున్న తమను ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రమబద్ధీకరించారని, తెలంగాణలోనూ అదే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 03:05 PM IST