MNCL: బెల్లంపల్లిలో BJP క్రమక్రమంగా పుంజుకుంటోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ 34వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన కొక్కేర రామ్మూర్తిని ఆయన కలిసి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేయాలన్నారు.
SRCL: సిరిసిల్ల పట్టణంలో సోమవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తారక రామ్ నగర్ కాలనీకి చెందిన కడవేరు కనకవ్వ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRCL: గ్రామ అభివృద్ధిలో ఎన్నారైల సేవలు అభినందనీయమని వేములవాడ ఐఏఎస్పీ రిత్విక్ సాయి అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఎన్నారైల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ఉండి కూడా గ్రామాభివృద్ధికి సహాయం చేయవచ్చన్నారు.
KNR: హుజూరాబాద్ పట్టణ శివారులోని కే.సీ క్యాంప్ రైతు వేదిక వద్ద మంగళవారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఉంటుందని ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు. యాసంగి పంటల యాజమాన్యం, నిషేధిత HT పత్తి సాగుపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.
KNR: హుజూరాబాద్ పట్టణ శివారులోని కే.సీ క్యాంప్ రైతు వేదిక వద్ద మంగళవారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఉంటుందని ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు. యాసంగి పంటల యాజమాన్యం, నిషేధిత HT పత్తి సాగుపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. డీఆర్ఎస్సీ సమావేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రంబుల్ స్టిప్స్ ఏర్పాటు,సైన్ బోర్డుల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563 రహదారులపై సమస్యాత్మక ప్రాంతాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు.
BDK: హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసియన్ అరోరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దమ్మపేట మాజీ సొసైటీ ఛైర్మన్ యెల్లిన రాఘవరావుని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
NZB: రుద్రూర్ మండలం అంబంలోని మోడల్ స్కూల్లో అదనపు తరగతి గదులకు ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. మోడల్ స్కూల్ భవన ప్రాంగణంలో నాలుగు అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్, రుద్రూర్ తహ’సీల్దార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
NGKL: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా, పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని TWJF జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, వెంకటస్వామి, పరమేశ్ కోరారు.
RR: హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల ఆక్రమణలపై ప్రజల నుంచి సోమవారం మొత్తం 59 వినతులు అందాయి. హయత్‌నగర్, అమీన్‌పూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో లేఅవుట్ స్థలాలను ప్లాట్లుగా మారుస్తున్నారని బాధితులు కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులకు విచారణకు ఆదేశించారు.
ఖమ్మం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా పౌర కేంద్రీకృత పాలన దిశగా కీలక అడుగు పడింది. గౌరవ మేయర్ నీరజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంపై దృష్టి సారించారు. ప్రజలతో స్వయంగా ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
SDPT: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు ప్రభుత్వం అందించే బీమా సౌకర్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
MDK: విద్యార్థులు లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని ఆ దిశగా కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎంఈఓ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణ పరిధి రావెల్లిలోని నర్సాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ విజయానికి తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
BDK: జిల్లాలోని పలు గ్రంధాలయాల అభివృద్ధికి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఇటీవల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సోమవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.