• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సూర్యాపేటలో పన్ను బకాయిదారులపై కొరడా

SRPT: సూర్యాపేట మున్సిపల్ పన్నులు, నల్లా బిల్లులు దీర్ఘకాలంగా చెల్లించని యజమానులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలుమార్లు నోటీసులిచ్చినా స్పందించని వారి ఇంటి నల్లా కనెక్షన్లను సోమవారం సిబ్బంది తొలగించారు. కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.

March 16, 2026 / 09:00 PM IST

రాష్ట్రపతిని కలిసిన ఎంపీ

ADB: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ఎంపీలతో కలిసి అల్పాహర విందులో నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలను రాష్ట్రపతితో చర్చించినట్లు ఎంపీ నగేష్ పేర్కొన్నారు.

March 16, 2026 / 08:56 PM IST

24న దేవాలయ హుండీ ఆదాయం లెక్కింపు

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24న ఉదయం 10 గంటలకు దేవాలయంలో హుండీ ఆదాయం లెక్కించడం జరుగుతుందన్నారు. భక్తులు వివిధ సందర్భాలలో హుండీలలో వేసిన నగదు, బంగారాన్ని లెక్కిస్తామని వెల్లడించారు.

March 16, 2026 / 08:54 PM IST

విద్యుత్ లైన్‌పై పడిన భారీ వృక్షం

MDK: తూప్రాన్ పట్టణ శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద 33 కేవీ విద్యుత్తు లైనులపై భారీ వృక్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో ఎండిపోయిన చెట్టు విరిగి విద్యుత్ లైన్ పై పడింది. దీంతో ఇస్లాంపూర్ సబ్ స్టేషన్ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెట్టు తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.

March 16, 2026 / 08:47 PM IST

‘రంజాన్ తోఫా పంపిణీలో కాంగ్రెస్ వైఫల్యం’

RR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ప్యాకెట్ల సంఖ్యను తగ్గించి, ఇఫ్తార్ నిధులు విడుదల చేయకుండా ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని BRS నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు తమ సొంత ఇళ్లలో తోఫా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

March 16, 2026 / 08:45 PM IST

రేపు విద్యుత్ సరఫరలో అంతరాయం

BHPL: రేగొండ మండల కేంద్రంలో నూతన వీధి దీపాలు అమర్చుతున్న నేపథ్యంలో మంగళవారం(రేపు) ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

March 16, 2026 / 08:44 PM IST

‘ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి’

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో SP నితిక పంత్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల సమస్యలను విని, చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, ఎలాంటి పైరవీలు లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు.

March 16, 2026 / 08:42 PM IST

కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి

SDPT: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించి విద్యార్థులకు రుచికరంగా వండాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్ధిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంటగది, స్టోర్ రూమ్ తనిఖీ చేస్తూ వంటగది పరిసరాలు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

March 16, 2026 / 08:40 PM IST

కలెక్టరేట్ వద్ద ఆశ కార్యకర్తల వంటా వార్పు

NGKL: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు సోమవారం వంటా-వార్పు నిర్వహించారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా తమ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.

March 16, 2026 / 08:40 PM IST

‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం’

JN: రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. పాలకుర్తిలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో నేడు ఝాన్సీరెడ్డి సమావేశమయ్యారు. ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు కల్పిస్తామని చెప్పారు.

March 16, 2026 / 08:40 PM IST

గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి: DMHO

MLG: మాతా-శిశు మరణాలు ఏ పరిస్థితిలోనైనా సంభవించకూడదని, ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని DMHO డా. గోపాలరావు అన్నారు. జిల్లా కేంద్రంలో గర్భధారణ సమయంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణపై ఆరోగ్య కార్యకర్తలకు ఇవాళ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించి తల్లి-బిడ్డ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.

March 16, 2026 / 08:37 PM IST

రోడ్డు భద్రతపై కలెక్టర్ సమీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టర్ రాజర్షిషా రోడ్డు భద్రతపై సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు శాఖల మధ్య సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు.

March 16, 2026 / 08:37 PM IST

ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్షా సమావేశం

HNK: జిల్లాలో అమలవుతున్న ‘ప్రజా పాలన–ప్రగతి’ ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో పరిస్థితిని సమీక్షించారు. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డిప్యూటీ డివిజనల్ పంచాయతీ అధికారులు రవిబాబు, గంగభవానితో నివేదిక సమర్పించారు.

March 16, 2026 / 08:34 PM IST

‘ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా’

NZB: ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తానని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ కవితారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ కార్యాలయంలో ఆమె ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి హాజరు అయ్యారు.

March 16, 2026 / 08:30 PM IST

కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

MNCL: జన్నారం మండలంలోని లింగాయపల్లిలో వీధి కుక్క దాడి చేయడంతో ఆరేళ్ల బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గ్రామానికి చెందిన ఆదిత్య సోమవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ కుక్క దాడి చేసి బాలుని పెదవి, చెంపలను కొరికింది. దాడి ఘటన చూసిన అక్కడివారు పరుగున వచ్చి కర్రలతో దాడి చేయగా కుక్క పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

March 16, 2026 / 08:30 PM IST