• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘మెడికల్ కాలేజ్ సమస్యలు పరిష్కరించాలి’

KMR: కామారెడ్డి లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం మరింత భూమిని, 60 అడుగుల అప్రోచ్ రోడ్డును మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. పోస్ట్ గ్రాడ్యు యేషన్ కోర్స్‌కు 32 సీట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.

March 17, 2026 / 07:09 AM IST

అనారోగ్య బాధితురాలికి రూ.10 వేల ఆర్థిక సాయం

NLG: నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన పెద్దమాము లక్ష్మమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ప్రజా నాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డి నిమ్స్‌కు వెళ్లి ఆమెను పరామర్శించి, రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట పెద్దమాము ప్రశాంత్, లాలయ్య తదితరులు ఉన్నారు.

March 17, 2026 / 07:08 AM IST

రేపు అన్ క్లెమ్డ్ పార్సెల్ వేలం

NZB: నిజామాబాద్-1 డిపో కార్గో పార్సిల్‌కు సంబంధించిన వస్తువులను ఈనెల 18న వేలం వేయనన్నట్లు డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. నిజామాబాద్ కార్గో ఆఫీస్ బస్టాండ్ ఎదుట మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ చెప్పారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని సూచించారు.

March 17, 2026 / 07:05 AM IST

పార్కు అభివృద్ధికి కలెక్టర్‌కు వినతిపత్రం

WNP: జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో ఉన్న పార్కుని డెవలప్ చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తిని మధు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. పార్కులో వ్యాయామశాల, వాకింగ్ ట్రాక్ గ్రీనరీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. కలెక్టర్ స్పందించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

March 17, 2026 / 07:02 AM IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

KNR: మానకొండూరు మండలం రాజీవ్ నగర్‌కు చెందిన యుండింటి సాయికుమార్(25) అనే యువకుడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ద్విచక్ర వాహనంపై కరీంనగర్‌కు వెళ్తున్న సాయికుమార్‌ను కరీంనగర్ నుంచి జమ్మికుంట వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్ మృతి చెందాడు.

March 17, 2026 / 07:02 AM IST

‘ఇల్లులేని ప్రతి ఒక్కరికీ మోడల్ కాలనీలో ఇల్లు’

SRPT: హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఇల్లులేని ప్రతి ఒక్కరికీ పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద నిర్మాణంలోని మోడల్ కాలనీలో ఇల్లు ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఒక పత్రిక ప్రకటనలో ఆయన తెలిపారు. 2,160 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి కానుందని పేర్కొన్నారు.

March 17, 2026 / 07:01 AM IST

నేడు, రేపు ప్రత్యేక ఆధార్ శిబిరం ఏర్పాటు

MNCL: జన్నారం మండలం హాస్టల్ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో నేడు, రేపు ప్రత్యేక ఆధార్ శిబిరం నిర్వహించనున్నట్లు పోస్టల్ శాఖ ASP రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామా సవరణలతో పాటు బయోమెట్రిక్, మొబైల్ నంబర్ లింకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ఒరిజినల్ పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 17, 2026 / 07:00 AM IST

నేడు నార్కట్‌పల్లిలో పవర్ సరఫరా నిలిపివేత

NLG: నార్కట్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ చంద్రశేఖర్ రావు తెలిపారు. పట్టణంలో రోడ్డు వెడల్పు పనులతో పాటు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ తీగల మార్పిడి పనులు చేపడుతున్నందున తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 17, 2026 / 06:52 AM IST

CKM ఆసుపత్రిలో సిబ్బంది వసూళ్ల దందా

WGL: నగరంలోని CKM ఆసుపత్రిని సిబ్బంది కమర్షియల్‌గా మార్చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపించారు. పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని సర్కార్ ఆదేశించగా, దానికి భిన్నంగా ఉందని అన్నారు. 6 ఆర్ఎంవోలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ లేకపోవడం వలన సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి రోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

March 17, 2026 / 06:40 AM IST

‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ’ కవికి ఆత్మీయ గౌరవం

SDPT: ‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ’ అంటూ తెలంగాణ ఆత్మను అక్షరాల్లో ప్రతిబింబించిన ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గర్వకారణమని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని తన సాహిత్యంతో అక్షరబద్ధం చేసిన సిద్ధారెడ్డి కృషి అమూల్యమన్నారు. ఈ పురస్కారం ఆయన సాహిత్య ప్రస్థానానికి లభించిన గొప్ప గుర్తింపని పేర్కొన్నారు.

March 17, 2026 / 06:35 AM IST

‘ఏప్రిల్ 1 నాటికి ఈ-ఆఫీసులుగా ప్రభుత్వ కార్యాలయాలు’

NZB: వచ్చే ఏప్రిల్ 1 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ-ఆఫీసులుగా మార్చాల్సిందేనని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిపాలనా పరమైన అనుమతులు, ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్ లైన్ విధానంలోనే జరగాలని ఆదేశించారు.

March 17, 2026 / 06:30 AM IST

మూల్యాంకన కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MBNR: జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

March 17, 2026 / 06:26 AM IST

పాలిసెట్ ప్రవేశాలు.. ఏప్రిల్ 16 వరకు ఛాన్స్

MDK: జహీరాబాద్ మండలం రంజోల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం పదవ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గుప్త తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆసక్తిగల విద్యార్థులు tspolycet.nic.in వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

March 17, 2026 / 06:23 AM IST

‘ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంచుతాయి’

RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ కిట్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు మతాల మధ్య సోదర భావాన్ని పెంచుతాయని తెలిపారు. ఇఫ్తార్ విందులో ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 06:22 AM IST

‘జాతీయ రహదారి-563 నిర్మాణం పూర్తి చేయాలి’

KNR: కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి-563 నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సమావేశం నిర్వహించారు.

March 17, 2026 / 06:16 AM IST