KNR: మానకొండూరు మండలం రాజీవ్ నగర్‌కు చెందిన యుండింటి సాయికుమార్(25) అనే యువకుడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ద్విచక్ర వాహనంపై కరీంనగర్‌కు వెళ్తున్న సాయికుమార్‌ను కరీంనగర్ నుంచి జమ్మికుంట వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్ మృతి చెందాడు.