PDPL: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులను త్వరగా పూర్తి చేయాలని ఆర్జీ-3 ఏరియా జీఎం మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జీఎం నాగేశ్వరరావులు అధికారులకు సూచించారు. జీఎం కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీ.జే. సురేఖ అకౌంటింగ్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
SDPT: జిల్లా యువతకు ఉపాధి కల్పించేందుకు వచ్చే నెలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆమె త్వరలోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగుల కోసం వ్యవసాయ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం తెలిపారు. స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకుల అనుమతితో రవాణా రంగం కింద టూ వీలర్, త్రీ వీలర్, వ్యవసాయ పథకాల కింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
NLG: కనగల్ మండలం దర్వేశీపురం స్టేజీ వద్ద ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 2026–27 సంవత్సరానికి తలనీలాలు, చీరలు, ఒడి బియ్యం సేకరణకు నేడు వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నాగిరెడ్డి తెలిపారు. వేలంలో పాల్గొనేవారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నల్గొండ బ్రాంచ్‌లో ఎల్లమ్మ దేవస్థానం దర్వేశీపురం పేరుతో డీడీ తీసి దేవస్థాన కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రైతులు మొక్క పంటను సాగు చేశారన్నారు. పంట కోత పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర రూ.2,400 అందించాలన్నారు
MNCL: రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, సోదరభావానికి నిదర్శనమని మందమర్రి ఏరియా GM రాధాకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగ జరుపుకోవడం మతసామరస్యానికి చిహ్నమని కొనియాడారు. ముస్లింలు లోక కల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు.
WNP: గ్రామీణ ఉపాధి హామీ పథకం, SDF, CSR నిధులతో వివిధ పాఠశాలలకు మంజూరు చేసిన కిచెన్ షెడ్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు మార్చి 31 లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై వనపర్తి ఐడీవోసీలో సమీక్షించారు. CSR నిధులు రూ.40.80 లక్షలతో మంజూరు చేసిన వివిధ పనులు పూర్తి చేయాలన్నారు.
NZB: బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా భీమల్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, చెరువుల పూడికతీత, ఆయకట్టుకు నీరందకపోవడంపై చర్చకు తేవాలని పేర్కొంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.
ADB: BC, SC, ST JAC ఛైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. విశారదన్ మహరాజ్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని DSP జిల్లా అధ్యక్షుడు గణేష్ మహారాజ్ అన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూ బాధితుల పక్షాన పోరాడుతున్న విశారదన్‌ను ఖమ్మం పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ADB: BC, SC, ST JAC ఛైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. విశారదన్ మహరాజ్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని DSP జిల్లా అధ్యక్షుడు గణేష్ మహారాజ్ అన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూ బాధితుల పక్షాన పోరాడుతున్న విశారదన్‌ను ఖమ్మం పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
JN: జనగామ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ TMRJC బాయ్స్ హాస్టల్ , SCDD బాయ్స్ హాస్టల్లను సోమవారం సాయంత్రం అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హాస్టల్ లోని వంటగదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశించారు.
MHBD: ఉగాది పండగ పురస్కరించుకుని MHBD జిల్లా కేంద్రంలోని పినిరెడ్డిగూడెం సమీపంలో ఉన్న కాకతీయ కాలం నాటి శ్రీశ్రీ కొండలమ్మ ఆలయంలో మంగళవారం నుంచి 21వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. 17న ప్రభల ఊరేగింపు, 18న పూర్ణకుంభంతో పూజలు, 19న నైవేద్య సమర్పణ, 20న మహాజాతర, 21న సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
NLG: మిర్యాలగూడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశారదన్ మహారాజ్ అరెస్టును ఖండిస్తూ సోమవారం రాత్రి నిరసన ధర్నా నిర్వహించారు. విశారదన్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. విడుదల చేయకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని జిల్లా జేఏసీ కో-కన్వీనర్ వజ్రగిరి అంజయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఫరూక్, శివన్ తదితరులు ఉన్నారు.
HYD: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్ధిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ మేరకు స్పందించనివారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ రేంజ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తదితర కార్యకలాపాల తనిఖీలు నిర్వహించారు. 2025-26లో అనధికార నిర్మాణాల్లో 47 ఫిర్యాదులు వచ్చాయని, కోటి రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉన్నాయన్నారు.