SRCL: సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ రూరల్ షీ టీమ్ బృందం సూచించింది. శుక్రవారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే నిర్భయంగా 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.
BHNG: కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలోని మహిళా ఐకత్ చేనేత హస్తకళ సొసైటీని సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నూతన డిజైన్లు రూపొందించాలని, ఉత్పత్తుల నాణ్యతను పెంచాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, మంచిపేరు సంపాదించాలని మహిళలను ప్రోత్సహించారు.
ADB: ఈనెల 21న తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ పంట కొనుగోలు చేయడం జరుగుతుందని AMC సెంటర్ ఇంఛార్జ్ కేశవ్ శుక్రవారం తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలు ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి గ్రామాల వారీగా రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు.
SRCL: యాసంగి సీజన్ (2025-26) ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో పౌర సరఫరాల శాఖ ఆద్వర్యంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ధాన్యం సేకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
BPHL: జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గంగారం గ్రామంలో కూరగాయల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అధికారి ఏ. సునీల్ కుమార్ మాట్లాడాతూ.. సీజన్‌కు వివిధ రకాల విత్తనాలు, సమతుల్య ఎరువులు, నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధ్యమని తెలిపారు. కిచెన్ గార్డెన్‌లతో పోషకాహారం, అదనపు ఆదాయం పొందవచ్చని ఆయన రైతులకు సూచించారు.
MNCL: జిల్లాలోని హోటళ్లలో ఆహార నాణ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, పర్యవేక్షించాల్సిన ఆహార భద్రతా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వారం రోజుల క్రితం బెల్లంపల్లిలో ఓ హోటల్‌లో భోజనం చేసిన పలువురు అస్వస్థతకు గురైనప్పటికీ, అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ASF: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ శుక్రవారం తెలిపారు. రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమతుల్యం సాధించిందని అన్నారు. ప్రతి వర్గాన్ని ఆదుకునే విధంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
NZB: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోపాల్ పీఎస్‌ను సీపీ సాయిచైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆయన స్టేషన్‌లో సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈసందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు
KMR: ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నేడు దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు MPDO ప్రవీణ్ కుమార్ వాటర్ పట్టించారు. అనంతరం దోమకొండలోని మర్రి కుంటలో ఉపాధి హామీ పనులు చేపట్టిడం జరిగింది. మొత్తం 87 మంది కూలీలు హాజరవగా, వారికి ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఈనెల 23న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మార్క్‌ఫెడ్ డీఎం రంజిత్ రెడ్డి ఇవాళ తెలిపారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400గా నిర్ణయించగా, తేమ శాతం 14లోపు ఉండాలని తెలిపారు. రైతులు దళారులకు నమ్మవద్దని సూచించారు.
NLG: కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం గ్రామానికి చెందిన కడారి శివాజీ యాదవ్(18) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ శివాజీ మృతదేహానికి నివాళులర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
MNCL: ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కరానికై ఈ నెల 24న డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు సామజిక సమస్యలపై క్యాంపెయిన్ చేయనున్నట్లు వెల్లడించారు.
ADB: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, EDM బండి రవి, టాస్క్ మేనేజర్ సాయి తదితరులున్నారు.
ADB: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలలో తగినంత నిల్వలు ఉన్నాయని, బుక్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై, సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన సుంచు మల్లేశం సామాజిక సేవకు గాను ఇటీవల డాక్టర్ అంబేద్కర్ జాతీయ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఇవాళ ధర్మారంలో అఖిలపక్ష నాయకులు ఆయనను అభినందించి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెరిక బానేష్ చొప్పదండి మల్లేశం, బొల్లి నందయ్య, అమరపల్లి నారాయణ, కూరపాటి శ్రీనివాస్, నూనె వెంకట నర్సు తదితరులు పాల్గొన్నారు.