కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను ఆయన నివాసంలో కలిసి ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు ఆయన ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్నారు.
WGL: మ్యాజిక్ బస్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన CKM కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, బీ -ఫాం, ఢీ – ఫాం పాస్ అయిన వారు హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VKB: తాండూరు డివిజన్ అభివృద్ధికి మెరుగైన సేవలు అందించాలని కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి RDO కర్ర అనితను కోరారు. శుక్రవారం RDOగా బాధ్యతలు చేపట్టిన అనితను శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాండూరు డివిజన్ గురించి చర్చించి డివిజన్ అభివృద్ధికి మెరుగైన సేవలను అందించాలని అన్నారు.
RR: షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలును హిందూ వాహిని సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. షాద్‌నగర్‌లో ఈనెల 27న హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమానికి రావాల్సిందిగా మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని నిర్వహించే శ్రీరామ శోభాయాత్రలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషదాయకమని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
MNCL: నెన్నెలలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు పట్టికలు, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు.
BDK: బూర్గంపాడు మండలం శ్రీరాంపురం పాయం ఎస్టీ కాలనీని సీడీపీవో రేవతి శుక్రవారం సందర్శించారు. శ్రీరాంపురం పాయం కాలనీలో కొత్త అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై గ్రోత్ మానిటరింగ్ చేపట్టి, వారికి టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు.
SRCL: సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ రూరల్ షీ టీమ్ బృందం సూచించింది. శుక్రవారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే నిర్భయంగా 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.
BHNG: కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలోని మహిళా ఐకత్ చేనేత హస్తకళ సొసైటీని సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నూతన డిజైన్లు రూపొందించాలని, ఉత్పత్తుల నాణ్యతను పెంచాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, మంచిపేరు సంపాదించాలని మహిళలను ప్రోత్సహించారు.
ADB: ఈనెల 21న తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ పంట కొనుగోలు చేయడం జరుగుతుందని AMC సెంటర్ ఇంఛార్జ్ కేశవ్ శుక్రవారం తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలు ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి గ్రామాల వారీగా రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు.
SRCL: యాసంగి సీజన్ (2025-26) ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో పౌర సరఫరాల శాఖ ఆద్వర్యంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ధాన్యం సేకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
BPHL: జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గంగారం గ్రామంలో కూరగాయల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అధికారి ఏ. సునీల్ కుమార్ మాట్లాడాతూ.. సీజన్‌కు వివిధ రకాల విత్తనాలు, సమతుల్య ఎరువులు, నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధ్యమని తెలిపారు. కిచెన్ గార్డెన్‌లతో పోషకాహారం, అదనపు ఆదాయం పొందవచ్చని ఆయన రైతులకు సూచించారు.
MNCL: జిల్లాలోని హోటళ్లలో ఆహార నాణ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, పర్యవేక్షించాల్సిన ఆహార భద్రతా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వారం రోజుల క్రితం బెల్లంపల్లిలో ఓ హోటల్‌లో భోజనం చేసిన పలువురు అస్వస్థతకు గురైనప్పటికీ, అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ASF: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ శుక్రవారం తెలిపారు. రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమతుల్యం సాధించిందని అన్నారు. ప్రతి వర్గాన్ని ఆదుకునే విధంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
NZB: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోపాల్ పీఎస్‌ను సీపీ సాయిచైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆయన స్టేషన్‌లో సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈసందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు
KMR: ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నేడు దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు MPDO ప్రవీణ్ కుమార్ వాటర్ పట్టించారు. అనంతరం దోమకొండలోని మర్రి కుంటలో ఉపాధి హామీ పనులు చేపట్టిడం జరిగింది. మొత్తం 87 మంది కూలీలు హాజరవగా, వారికి ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.