• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అలీముద్దీన్ మరణం తీరని లోటు: ఎమ్మెల్యే

NLG: దేవరకొండ పట్టణంలోని 13వ వార్డుకు చెందిన ప్రముఖ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అబ్దుల్ అలీముద్దీన్ మృతి పట్ల ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులకు ఈ బాధను భరించే ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ప్రార్థించారు. ఈ పరామర్శలో ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

February 28, 2026 / 10:30 AM IST

మార్చి 10 వరకు జనసేన సభ్యత్వ నమోదు

SRCL: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26 నుంచి మార్చి 10వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ పెంటల మహేష్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెసక్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహణ కోసం నియోజకవర్గాల వారీగా అడాక్ కోఆర్డినేటర్లను నియమించారన్నారు.

February 28, 2026 / 10:29 AM IST

భూదాన్ భూమి చుట్టూ హద్దులు

ఖమ్మం భూదాన్ భూముల్లో నిర్మాణాలను ఈనెల 24న తొలగించగా చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే హద్దులు నిర్ధారించగా గోతులు తవ్వి ఫెన్సింగ్ రాళ్లు పాతే పనులు మొదలుపెట్టారు. తద్వారా భూముల్లోకి ఎవరూ రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.

February 28, 2026 / 10:25 AM IST

కాంగ్రెస్‌లో చేరిన అర్షద్ హుస్సేన్

ASF: బెజ్జూర్ మండల మాజీ సింగిల్ విండో ఛైర్మన్ అర్షద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ సమక్షంలో అర్షద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అర్షద్‌కు మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించారు.

February 28, 2026 / 10:25 AM IST

ఇండస్ట్రియల్ కారిడార్‌పై రాజకీయ రచ్చ

ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామికవాడ భూముల గుర్తింపు చుట్టూ రాజకీయం రచ్చ మొదలైంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏరియల్ సర్వే చేపట్టడానికి ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే దొంగతనంగా రావలసిన అవసరం ఏముందని, ఇది వారి మధ్య చీకటి ఒప్పందం అని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శలు గుప్పించారు.

February 28, 2026 / 10:25 AM IST

ఉప్పల్ నుంచి చిల్కానగర్ పనులపై డీసీకీ ఫిర్యాదు..!

MDCL: ఉప్పల్ డివిజన్ పరిధిలోని పది కాలనీ సంఘాలు పైప్‌లైన్ పనులపై ఆందోళన వ్యక్తం చేశాయి. గణేశ్‌నగర్ నుంచి చిలుకానగర్ రహదారిలో తవ్వకాల వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని డిప్యూటీ కమిషనర్ జి. రాజుకు ఫిర్యాదు చేశారు. చిన్న పనులకు ఎక్కువ దూరం తవ్వకాలు చేయడం, కేబుల్, డ్రైనేజీ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నేతలు పేర్కొన్నారు.

February 28, 2026 / 10:24 AM IST

చెరువులో పడి వ్యక్తి మృతి

KMR: పిట్లం మండలంలోని చిన్న కోడపల్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన భజరంగ్ శుక్రవారం రాత్రి కాలకృత్యాల కోసం ఇంటి సమీపంలోని రెడ్డి చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

February 28, 2026 / 10:23 AM IST

భద్రాచలంలో యువకుడి ఆత్మహత్య

భద్రాచలం పట్టణంలో ఓ యువకుడు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడు స్థానిక వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

February 28, 2026 / 10:22 AM IST

ఉరివేసుకొని ఒకరి ఆత్మహత్య

SDPT: బెజ్జంకి మండలంలోని ఎల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గుబిరే రాజయ్య (65) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం మృతుని సోదరుడు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 10:22 AM IST

స్టాక్ మార్కెట్ కాల్స్.. నమ్మితే నట్టేట మునిగినట్టే..!

HYD: స్టాక్ మార్కెట్‌లో మీకు డిమార్ట్ అకౌంట్ ఉందా..? అయితే.. మేం స్టాక్ మార్కెట్ కాల్స్, సూచనలు చేస్తామని ఇమ్మడి ముబ్బడిగా వాట్సాప్, కాల్స్ ద్వారా సంప్రదిస్తుంటారు. ఒకవేళ వాటిని నమ్మితే నట్టేట మునిగినట్టే. భారీ నష్టం వచ్చిందా..? మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఒక్కోసారి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదు. ఇలాంటి వాటి పై జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచించారు.

February 28, 2026 / 10:20 AM IST

ఇందిరమ్మ విగ్రహమా? సేవాలాల్ విగ్రహమా?

RR: షాద్‌నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నిర్వహిస్తున్న సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కాస్త రాజకీయ రంగు పులుముకోవడంపై LHPS కొత్తూరు మండల అధ్యక్షులు బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనా?లేక ఇందిరమ్మ విగ్రహ ప్రతిష్టాపనా?అని ప్రశ్నించారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారన్నారు.

February 28, 2026 / 10:19 AM IST

పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ విజయవంతం

PDPL: సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామ పంచాయతీ వార్డుసభ్యుల కోసం నిర్వహించిన 5రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, నిధుల వినియోగం, గ్రామసభల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. ముగింపు సందర్భంగా ఎంపీడీఓ దివ్యదర్శన్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

February 28, 2026 / 10:16 AM IST

కుక్కలగూడూర్ ZPHSలో విద్యార్థుల అద్భుత ప్రదర్శన

PDPL: పాలకుర్తి మండలం కుక్కలగూడూరు ZPHSలో చదువుతున్న విద్యార్థులు “అవయవాలు – వాటి పని తీరు” అంశంపై అద్భుత ప్రదర్శన చేశారు. రుచి, స్పర్శ, వాసన, వినికిడి, చూపు వంటి ఇంద్రియాల పనితీరును నమూనాల ద్వారా స్పష్టంగా వివరించారు. బొడ్డు నవ్య, ఆవుల అవంతిక విద్యార్థినులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పిల్లల సృజనాత్మకతను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

February 28, 2026 / 10:15 AM IST

షాద్‌నగర్ పట్టణంలో అగ్నిప్రమాదం

RR: అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన షాద్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. పట్టణంలోని హాజీపల్లి రోడ్డులోగల దుకాణం, జనరల్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణ యజమాని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 10:15 AM IST

మహబూబ్నగర్‌లో రోడ్డు భద్రతా కార్యక్రమం

MBNR: జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు వన్ టౌన్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం జరిగింది. ఇన్స్‌స్పెక్టర్ అప్పయ్య వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రాణహానికరమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై సీనయ్య, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

February 28, 2026 / 10:10 AM IST