HYD: ఆరోగ్యకర జీవనానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఎంతో అవసరం అని రామంతపూర్ డా.అంబికా తెలిపారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి, యాపిల్, పియర్, అవకాడో, బ్లాక్ బీన్స్, శనగలు, మినుములు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, విత్తనాలు ఆహారంలో చేర్చితే గుండె ఆరోగ్యం మెరుగవుతుందన్నారు.
BDK: ఆదివారం అన్నపురెడ్డిపల్లిలో శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగాయి. అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించగా గరుడ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు మొక్కులు చెల్లించారు.
HYD: ‘ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణం ముద్దు’ అనే నినాదంతో ఆదివారం పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్దఎత్తున ముందుకొచ్చారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, కీసర చెరువుల పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛందంగా శుభ్రం చేశారు. రణవీర్ సింగ్, శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయన్నారు.
WGL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సంపేట మైనార్టీ బాలికల పాఠశాలలో శనివారం అంతర్జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను (DMHO) డా. సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం మన జీవితంలో కీలకమని అన్నారు. విద్యార్థులు సైన్స్ పరిజ్ఞానం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యార్థులకు సూచించారు.
జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో అందించే 5 నెలల ఉచిత శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. ఈరోజు ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు.
KMM: తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన షేక్ ఆయేషా విద్యారంగంలో సత్తా చాటారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ అమితి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. శనివారం జరిగిన కాన్వొకేషన్‌లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ దేకా చేతుల మీదుగా ఆమె ఈ గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. గోల్డ్ మెడల్ అందుకున్న ఆమెను పలువురు అభినందిస్తున్నారు.
VKB: జిల్లా నిరుద్యోగ యువతకు ‘శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, దీనికి అర్హులన్నారు.
MDCL: స్వయం వృత్తితోనే మహిళల సాధికారత సాధ్యమని సామాజిక జన చైతన్య శాఖ ప్రెసిడెంట్ సుధాకర్ అన్నారు. మౌలాలిలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబులు కావాలని, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
WNP: కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లిన చాకలి కులస్తులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ శనివారం విమర్శించారు. వెంటనే స్పందించి నిందితులపై రాజ్యాంగబద్ధంగా కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
KNR: హుజురాబాద్ మండలంలోని 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన 4 పరీక్ష కేంద్రాల పరీక్ష పత్రాలను హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచినట్టు ఎంఈఓ విడపు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూట్ ఆఫీసర్ రామయ్య, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్ మురళి మనోహర్, పరీక్ష కేంద్రాల సూపరిండెంట్స్ సమ్మిరెడ్డి సత్య ప్రసాద్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.
MNCL: రాయితీపై అందించే డ్రోన్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని DAO సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లు కేటాయించారని, ఇందులో మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లకు 3, బెల్లంపల్లి, భీమిని డివిజన్లకు 2 చొప్పున కేటాయించామని పేర్కొన్నారు. యంత్ర పరికరాలకు వ్యక్తిగతంగా రైతులు దరఖాస్తు చేసుకునే విధంగా ADAలు, AO లు చర్యలు తీసుకోవాలన్నారు.
HYD: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు HYDకు రానున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న DCCల శిక్షణ కార్యక్రమంలో వారితో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశనిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
కరీంనగర్: హైదరాబాద్ బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ సమక్షంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. లంబాడీల ఆరాధ్యదైవం సంతులాల్ అని, లంబాడీల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ రూలర్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్ ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.