• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పేదింటి కుటుంబానికి కళ్యాణ లక్ష్మీ వరం లాంటిది: MLA

ADB: పేదింటి ఆడపిల్ల కుటుంబానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. శనివారం బజారహత్నూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మాజీ CM KCR ప్రవేశపెట్టిన అన్ని పథకాలతో ప్రజలకు మేలు చేకూరిందని పేర్కొన్నారు.

March 7, 2026 / 04:02 PM IST

ఖిల్లా పార్కులో మున్సిపల్ స్పెషల్ డ్రైవ్

NLG: దేవరకొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో ఖిల్లా పార్కులో మౌలిక వసతుల కల్పనకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పార్కులోని వ్యర్థాలు, కలుపు మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. చిన్నారుల ఆట వస్తువులకు మరమ్మతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రాజు, మాజీ సర్పంచ్ పున్న వెంకటేష్, మాజీ ఎంపీటీసీ సైదులు, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 04:01 PM IST

మార్చి 10న వనపర్తిలో జాబ్ మేళా

WNP: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మార్చి 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి, మహబూబ్ నగర్, హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పనకు వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు.

March 7, 2026 / 04:01 PM IST

కెఆర్‌కే సన్‌షైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేషన్ కిట్ల పంపిణీ

KMR: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు చేయూతనిస్తూ, కెఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో శనివారం రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘షీ టీమ్’ పి.సి. సౌజన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపికైన 250 కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లను పంపిణీ చేశారు.

March 7, 2026 / 04:01 PM IST

ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుంది: ఛైర్మన్

HNK: కమలాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం 60 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్, సర్పంచ్ పబ్బు సతీష్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు తదితరులు ఉన్నారు.

March 7, 2026 / 04:00 PM IST

పట్టిస్తే రూ.10 వేలు.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా

JN: జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి గ్రామాలు, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామం ఈ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే, మద్యం అమ్మిన వారికి రూ.లక్ష జరిమానా, తాగినవారిని పట్టిస్తే రూ.10 వేల నజరానా ప్రకటించారు.

March 7, 2026 / 04:00 PM IST

నూతన ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్

KMM: వైరాలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, పనుల వేగంపై అసహనం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

March 7, 2026 / 03:56 PM IST

‘విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి’

BHPL: జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మార్చి 10 వరకు పొడిగించినట్లు జిల్లా అధికారులు ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ధికారులు మాట్లాడుతూ.. అర్హత గల విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 7, 2026 / 03:53 PM IST

అభివృద్ధి కార్యాచరణపై మంత్రి సమావేశం

KMM: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సమావేశంలో 99 రోజుల కార్యాచరణలో చేపట్టే కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.

March 7, 2026 / 03:51 PM IST

పార్టీ జాతీయ మహిళా కార్యదర్శిని కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ

WGL: తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ శనివారం HYDలో పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లంబాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి.. శాలువుతో ఘనంగా సన్మానించారు. అనంతరం వరంగల్ పర్యటనకు రావాలని అల్కా లంబాను ఆహ్వానించారు.

March 7, 2026 / 03:50 PM IST

రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

VKB: దక్షిణ భారతదేశంలోనే ఏకశిలా పర్వతంగా ప్రసిద్ధి చెందిన కుల్కచర్ల మండలంలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8న నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని EO. బాల నరసయ్య తెలిపారు. కాగా, బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

March 7, 2026 / 03:45 PM IST

ఆయిల్ పామ్ తోటను ధ్వంసం చేసిన దుండగులు

MHBD: చిన్నగూడూరు(M) కేంద్రానికి చెందిన రైతు నీలం శంకరయ్య నాలుగెకరాల ఆయిల్ పామ్ తోటను దుండగులు ధ్వంసం చేశారు. చిలువేరు సుమన్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు JCB సాయంతో తోటను వేర్లతో సహా పీకేశారు. తోట రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 7, 2026 / 03:43 PM IST

ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే

MBNR: ప్రజారోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత లభిస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జానంపేట పీహెచ్సిలో ప్రముఖ వైద్యులచే నిర్వహించిన వైద్యశిబిరాన్న ఇవాళ ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.

March 7, 2026 / 03:35 PM IST

ఎమ్మెల్యేను కలిసిన NRI కాస రాకేష్ యాదవ్

SRPT: తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్‌ను శనివారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన NRI కాస రాకేష్ యాదవ్, కొమ్ము నగేష్‌లు మర్యాద పూర్వకంగా కలిశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మొక్కను బహుకరించి, నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు.

March 7, 2026 / 03:35 PM IST

ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష

NLG: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్గొండలో ఉమ్మడి జిల్లా సమగ్ర కార్యాచరణ సమావేశం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్, మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొని అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించారు.

March 7, 2026 / 03:32 PM IST