• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్రామీణ ఉత్పత్తుల సంతను ప్రారంభించిన వీసీ

HNK: ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని కేయూ వీసీ ప్రతాపరెడ్డి అన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానం గ్రామీణ ఉత్పత్తుల సంతను వీసీ ప్రారంభించారు. కోవిడ్ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచిందని, సేంద్రియ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, పాలకమండలి సభ్యురాలు అనితారెడ్డి, నిమ్మల శ్రీనివాస్ ఉన్నారు.

February 23, 2026 / 12:39 PM IST

పరీక్షల మధ్య సెలవుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

VKB: జిల్లాలో పరీక్షల సమయంలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కీలక చర్యలు చేపట్టింది. సీబీఎస్ఈ (CBSE) తరహాలో పరీక్షల మధ్య విరామ సమయాన్ని పెంచారు. ఈ గ్యాప్‌లో విద్యార్థులు బడికి వచ్చేలా ప్రోత్సహిస్తూ, వారిని పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు ప్రతిరోజూ మూడు ప్రత్యేక పీరియడ్లను కేటాయించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) రేణుకాదేవి తెలిపారు.

February 23, 2026 / 12:38 PM IST

తిరుమలకుంట పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ వితరణ

KMM: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పరిషత్ అప్పర్ ప్రాథమిక పాఠశాలకు సర్పంచ్ కోర్సా రాజేష్, ఉపసర్పంచ్ నాగ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వాటర్ ప్యూరిఫైయర్‌ను అందజేశారు. సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి దీనిని ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు.

February 23, 2026 / 12:37 PM IST

ముప్పారం పంచాయతీ భవనానికి రూ.20 లక్షల నిధులు

MDK: అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద ఈ నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో సహకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఈ సందర్భంగా గ్రామస్థులు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 12:32 PM IST

45 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి అనుమతి

PDPL:ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో 45 నిమిషాల ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లలో ఇంటర్ ప్రథమ 5120,ద్వితీయ 5247మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలలో అన్ని సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9-12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు.

February 23, 2026 / 12:31 PM IST

మెరుగైన పాల ఉత్పత్తులని వాడాలి: MLA

ADB: ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన మెరుగైన పాల ఉత్పత్తులని ప్రజలు వాడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలోని విజయ పాల ఉత్పత్తుల కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ ఛైర్మన్ బండారు అనూష తదితరులున్నారు.

February 23, 2026 / 12:30 PM IST

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: ఎంపీడీవో

MNCL: గ్రామాల అభివృద్ధి ప్రణాళికలలో వార్డు సభ్యుల భాగస్వామ్యం ముఖ్యమైందని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీఓ జలంధర్ అన్నారు. జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు మండల కేంద్రంలోని రైతు వేదికలో రెండో విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు అవసరమన్నారు.

February 23, 2026 / 12:30 PM IST

భవనానికి శంకుస్థాపన చేసిన విప్

JGL: భీమారం మండలం గోవిందరం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమైక్య సంఘం (VO) భవన నిర్మాణానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అలాగే మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం వెల్లడించారు.

February 23, 2026 / 12:30 PM IST

న్యూడెమోక్రసీ సదస్సు పోస్టర్స్ విడుదల

MNCL: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు CPI (ML) న్యూడెమోక్రసీ కోల్ బెల్ట్ కార్యదర్శి బ్రహ్మానందం తెలిపారు. రామకృష్ణాపూర్లో సోమవారం సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, మేధావులు, న్యూడెమోక్రసీ కార్యకర్తలు సదస్సులో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలన్నారు.

February 23, 2026 / 12:30 PM IST

‘ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి’

NRML: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వారు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.

February 23, 2026 / 12:30 PM IST

పున:ప్రారంభమైన మార్కెట్ ధరలు ఇలా..!

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవులు అనంతరం సోమవారం పున:ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 7,545, క్వింటాల్ తేజ మిర్చి ధర రూ. 18,300, క్వింటాల్ వండర్ హట్ ధర రూ. 37,000, క్వింటాల్ 341(కారం కాయ) ధర రూ. 22,100 గా ధరలు నమోదయ్యాయి.

February 23, 2026 / 12:30 PM IST

అంగన్వాడీ టీచర్ నుంచి కార్పొరేటర్

KNR: రామగుండం కార్పొరేషన్ వెంకట్రావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేసే రమ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ 16వ డివిజన్ నుంచి BRS అభ్యర్థిగా ఆమె పోటీ చేసి విజయం సాధించారు. చిన్ననాటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందన్నారు. గత ఎన్నికల్లో అదే డివిజన్‌లో భర్త కిషన్ రెడ్డి కార్పొరేటర్‌గా ఉన్నారు.

February 23, 2026 / 12:30 PM IST

రేపు సుబ్లేడులో ‘వారాంతపు సంత’ ప్రారంభం

KMM: తిరుమలాయపాలెం గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం సుబ్లేడులో కొత్తగా వారాంతపు సంతను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రతి వారం ఈ సంత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం సంత నిర్వహించే ప్రదేశాన్ని డోజర్‌తో శుభ్రం చేయించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

February 23, 2026 / 12:28 PM IST

రామారావు మృతి బాధాకరం మాజీ ఎమ్మెల్యే బొల్లం

SRPT: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ సర్పంచ్ శరభయ్య తండ్రి రామారావు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోదాడ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:26 PM IST

సమస్యలపై సమరం.. పనులు ప్రారంభం

RR: ఆమనగల్ మున్సిపాలిటీలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ పత్యానాయక్, పాలకవర్గం పనులపై దృష్టి సారించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో పగిలిపోయిన మంచినీటి పైపులు పర్యవేక్షించారు. వెంటనే వాటిని మరమ్మతు చేసే పనులను ప్రారంభించారు. సమస్యలను వెంటనే పాలకవర్గం పరిష్కరిస్తుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 12:24 PM IST